Pune Farmer: ఆడపిల్లను భారమనుకుంటున్నారు. పురిట్లోనే చంపేస్తున్నారు. పుట్టకుండానే కడుపులోనే అబార్షన్ చేయిస్తున్నారు. మగవాడు అంటేనే కడుపు ఉంచుకుంటున్నారు. లేదంటే తీసేస్తున్నారు. కానీ వారిని ఆడపిల్ల పుట్టిందంటేనే అరిష్టమని భావిస్తున్న నేటిరోజుల్లో ఆమెను అపురూపంగా చూసుకునే వారు ఉండటం గమనార్హం. ఈనేపథ్యంలో వారి సంరక్షణకు చర్యలు తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది.

పుణేలోని ఓ రైతు తన కొడుకుకు ఆడపిల్ల పుట్టింది. తొలిసారి కావడంతో పుట్టింట్లో అమ్మాయికి జన్మనిచ్చింది. దీంతో తాత అజిత్ పాండురంగ్ బాల్వాడ్కర్ తన మనవరాలిని తీసుకొచ్చేందుకు ఓ ఘనమైన కార్యం చేశాడు. మా ఇంటి మహాలక్మిని మామూలుగా తీసుకురావాలని ప్లాన్ చేశారు. ఏదైనా ఘనంగా ఏర్పాట్లు చేయాలని భావించాడు. అందరిని ఆశ్చర్యానికి గురి చేసేలా ఓ పథకంవేశాడు.
ఏకంగా ఓ హెలికాప్టర్ ను బుక్ చేశాడు అమ్మమ్మ వారింటి నుంచి తన మహాలక్ష్మిని తీసుకువచ్చేందుకు హెలికాప్టర్ లో ఇంటికి తీసుకురావడంతో అందరు నోరెళ్లబెట్టారు. ఆడపిల్ల తమ ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందుకే వెరైటీగా స్వాగతం పలికినట్లు చెబుతున్నారు. ఆడపిల్లని చీప్ గా చూసే నేటి రోజుల్లో ఇంత భారీ స్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేయడం గమనార్హం.

దేశంలో ఆడపిల్లల పట్ల జరుగుతున్న దారుణాల నేపథ్యంలో అమ్మాయి పుట్టిందంటేనే తమకు కష్టాలు వస్తున్నాయని భావిస్తున్న తరుణంలో ఓ రైతు తన ఇంటికి ఇలా ఆహ్వానం పలకడంతో అందరు ప్రశంసిస్తున్నారు. ఆ రైతు తీరుకు ఫిదా అవుతున్నారు. అమ్మాయిలను అపురూపంగా చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నారు. అందరు ఈ రైతుగా ఆలోచించి కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటే దేశంలో శిశు హత్యలు కూడా ఉండవనే విషయం అర్థమవుతోంది.
Also Read: Sarkaru Vaari Paata First Full Review: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ