Director Parashuram Biography: తెలుగు బాక్సాఫీస్ కి ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ ఫుల్ కిక్ ఇచ్చింది. భారీ విజువల్స్ తో, మహేష్ – కీర్తి సురేష్ మధ్య బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ తో, అలాగే ఎమోషనల్ సీన్స్ తో.. పరశురామ్ చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. కానీ, ‘గీత గోవిందం’ సినిమాకి ముందు పరశురామ్ కి దర్శకుడిగా విలువ లేదు. కథ చెబుతాను అంటే.. చిన్నాచితకా హీరోలు కూడా ఆయనకు ఊ కొట్టలేదు. సినిమా లేక, ఏ హీరో డేట్లు ఇవ్వక, దాదాపు ఒక సినిమా కోసం నాలుగేళ్లు పరశురామ్ కష్టపడ్డాడు. ఆ మాట కొస్తే.. కష్టాల మీదే ఆయన సినీ కెరీర్ సాగింది. మరి ఆయన బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం.
పరశురామ్ వ్యక్తిగత విషయాలు :
పరశురామ్ డిసెంబరు 25న విశాఖపట్నం జిల్లా చెర్లోపాలెం లో జన్మించాడు. మధ్యతరగతి కుటుంబం వారిది. చిన్నతనం నుంచే సినిమాలు అంటే ఇష్టం. అందుకే, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేసినా.. సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. పరశురామ్ కి ముద్దు పేరు బుజ్జి. ఆయనను సన్నిహితులు బుజ్జి అనే పిలుస్తారు.
సినిమా రంగంలోకి ఎలా వచ్చారంటే ?
2002లో తన ఎంబిఏ పూర్తిచేసిన పరశురామ్ కి జాబ్ పై ఆసక్తి కలగలేదు. తన బంధువు పూరి జగన్నాథ్ ను కలిశాడు. సినిమాల పై ఇంట్రెస్ట్ అని చెప్పారు. పూరి ఒప్పుకోలేదు. పరశురామ్ కూడా పట్టు విడవలేదు. దాంతో పూరి తన దగ్గరే అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఆంధ్రావాలా, 143 సినిమాలకు పరశురామ్ సహాయ దర్శకుడిగా పూరి దగ్గరే పనిచేశాడు. ఐతే, 2008లో మొదలైన పరుగు సినిమాకు భాస్కర్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా ఎదిగాడు పరశురామ్.
మొదటి సినిమా దర్శకత్వం :
సహాయ రచయితగా పరశురామ్ కొన్ని సినిమాలకు పని చేసినా గుర్తింపు రాలేదు. దాంతో ఎలాగైనా డైరెక్టర్ గా మారాలి అనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు తర్వాత ‘యువత’ అనే సినిమా ద్వారా దర్శకుడిగా హిట్ కొట్టాడు. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా వచ్చిన ఈ యువత సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
మొదటి విజయం తర్వాత పరశురామ్ అపజయం :
2009లో రవితేజ హీరోగా పరశురామ్ దర్శకత్వం వహించిన ‘ఆంజనేయులు’ సినిమా పరాజయం పాలు అయింది. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయిన ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. ఈ ప్లాప్ పరశురామ్ ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టింది.
అపజయం నుంచి పరశురామ్ మొదటి విజయోత్సాహం !
2011లో నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘సోలో’ సూపర్ హిట్ అయ్యింది. ప్రశంసలతో పాటు పరశురామ్ కి మంచి పేరును తీసుకొచ్చింది. ఒక విధంగా పరశురామ్ మొదటి విజయోత్సాహం ఇదే.
దర్శకుడిగా కష్టకాలం :
‘సోలో’ హిట్ తర్వాత పరశురామ్ కి వరుస ప్లాప్ లు వచ్చాయి. రవితేజ హీరోగా చేసిన ‘సారొచ్చారు’ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద పరశురామ్ పరాజయమే ఎదురైంది. మళ్ళీ దర్శకుడిగా నిలబడటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అప్పుడే ‘గీత గోవిందం’ కథ రాశాడు. ఎన్నో బాధలు అనంతరం చేసిన సినిమా ఇదే. లవ్ .. ఎమోషన్ ను ప్రధానంగా చేసుకుని పరశురామ్ తెరకెక్కించిన ఈ ‘గీత గోవిందం’ సంచలన విజయాన్ని సాధించింది.
‘సర్కారు’తో పెరిగిన డిమాండ్ :
‘గీత గోవిందం’ సక్సెస్ ఇచ్చిన కిక్ తోనే ఈ సారి యాక్షన్ ను కూడా జోడించి ‘సర్కారువారి పాట’ సినిమా చేశాడు. మనీ నేపథ్యంలో తీసిన ఈ సినిమాతో పరశురామ్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. పరశురామ్ ఇలాగే మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ.. మా ఓకేతెలుగు ఛానెల్ నుంచి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం.
Also Read:Sarkaru Vaari Paata First Full Review: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ