
Pulsar Bike Jhansi: పల్సర్ బైక్ ఝాన్సీ అంటే తెలియని తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ఉండరేమో. సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన ఈ డాన్సర్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ‘పల్సర్ బైక్ సాంగ్’ కి ఝాన్సీ తన టీమ్ తో అద్భుతంగా డాన్స్ చేస్తుంది. ఆ వీడియోలు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తుంటారు. పల్సర్ బైక్ ఝాన్సీ స్టేజ్ పెర్ఫార్మన్స్లు, తిరునాళ్లలో డాన్స్ వీడియోలకు విపరీతంగా స్పందన వచ్చింది. లక్షల్లో ఆ వీడియోలను జనాలు వీక్షించారు. ఆ విధంగా ఆమె మల్లెమాల వాళ్ళ కంట్లో పడింది.
శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పెర్ఫార్మన్స్ ఇచ్చే ఛాన్స్ ఇచ్చారు. ఆ ఎపిసోడ్ కి పల్సర్ బైక్ సాంగ్ హైలెట్ అయ్యింది. అలా ఝాన్సీ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆమె పలు షోలలో సందడి చేస్తున్నారు. వృత్తి రీత్యా ఝాన్సీ గాజువాక డిపోలో కండక్టర్. తన జాబ్ చేసుకుంటూనే ఈవెంట్స్, బుల్లితెర షోలలో పాల్గొంటున్నారు. అయితే తాను ఓవర్ నైట్ స్టార్ అంటే ఒప్పుకోనని ఝాన్సీ అన్నారు. దీని వెనుక 18 ఏళ్ల శ్రమ ఉందని చెప్పుకొచ్చారు.

డాన్సర్ వృత్తిని ఎంచుకోవడం వలన అనేక అవమానాలు ఎదుర్కొన్నానని ఆమె అన్నారు. మొదట్లో అయినవాళ్లే అవమానించారు. ఆడపిల్ల డాన్సులు చేయడమేంటని దూరం పెట్టారని చెప్పారు. ఒకరోజు బట్టలు కుట్టించుకోవడానికి టైలర్ దగ్గరికి వెళితే.. కొలతలు తీసుకుంటూ తప్పుగా తాకాడు. అదే విషయం నాన్నకు చెబితే, నేను మీ నాన్నను అన్న విషయం చెప్పకు అని దారుణంగా మాట్లాడాడని చెప్పి ఝాన్సీ ఆవేదన చెందారు.
పల్సర్ బైక్ సాంగ్ ఎంత పాప్యులర్ అంటే… రవితేజ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ధమాకా మూవీలో పెట్టారు. ‘ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా’ అంటూ రవితేజ గట్టిగా డైలాగ్ చెబుతాడు. ధమాకా మూవీలో రవితేజ, శ్రీలీల అదిరిపోయే పెర్ఫార్మన్స్ పల్సర్ బైక్ సాంగ్ కి ఇచ్చారు. ప్రదీప్ యాంకర్ ఓ షో స్టార్ట్ కాబోతుంది. అందులో కొందరు బుల్లితెర లేడీ సెలెబ్రిటీలతో పాటు పల్సర్ బైక్ ఝాన్సీ పాల్గొనబోతుంది. భవిష్యత్ లో ఆమె మరింత క్రేజ్ రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి.