
Desamuduru Re Release: గత కొంతకాలం నుండి సినిమా ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి కానీ జల్సా ,ఖుషి, పోకిరి మరియు ఆరెంజ్ సినిమాలు మాత్రమే గ్రాండ్ సక్సెస్ సాధించాయి. ఏప్రిల్ 6 వ తారీఖున స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘దేశముదురు’ చిత్రం రీ రిలీజ్ అవుతుంది.ఏప్రిల్ 8 వ తారీఖున అల్లు అర్జున్ పుట్టినరోజు కాబట్టి, ఈ సినిమాని స్పెషల్ షోస్ గా నిర్వహిస్తున్నారు.
ఏప్రిల్ 8 వ తారీఖుని ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాల్సింది, కానీ 7 వ తారీఖు నుండి కొత్త సినిమాలు విడుదల అవ్వబోతుండడం తో ఈ సినిమాని ఆరవ తేదికి ప్రీ పోన్ చేసారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ వైజాగ్ మరియు హైదరాబాద్ లోని కొన్ని థియేటర్స్ లో ఓపెన్ చేసారు, వాటి ట్రెండ్ ఎలా ఉందొ ఒకసారి చూద్దాము.
వైజాగ్ ప్రాంతం లో అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ఆశించిన స్థాయిలో లేనప్పటికీ, హైదరాబాద్ లో మాత్రం ఒక రేంజ్ స్పీడ్ లో ఉన్నాయి.RTC క్రాస్ రోడ్స్ లోనే సంధ్య 70 ఏం ఏం థియేటర్ లో కాసేపటి క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. రెండు షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా, టికెట్స్ మొత్తం రెండు నిమిషాలలోనే సోల్డ్ అవుట్ అయిపోయాయి.

ఇంత ఫాస్ట్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ఖుషి మరియు పోకిరి రీ రిలీజ్ లకు కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదట.సంధ్య 70 ఏంఏం థియేటర్ కెపాసిటీ 1200 సీట్లు ఉంటుంది. అంటే రెండు షోస్ కి కలిపి 2400 సీట్లు అన్నమాట. బుకింగ్స్ ప్రారంభించిన రెండు నిమిషాల వ్యవధిలోనే 2400 టిక్కెట్లు అమ్ముడుపోయాయట. ఇదే ఫ్లో ని పూర్తి స్థాయి బుకింగ్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా కొనసాగిస్తే రీ రిలీజ్ సినిమాలలో సరికొత్త రికార్డు ని నెలకొల్పవచ్చు.