Professional Cuddler: ప్రపంచంలో ప్రతి రోజు కూడా ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని దాన్ని వేడుకగా చేసుకుంటున్నారు ప్రజలు. పండగలు, ఉత్సవాలే కాదు నార్మల్ రోజు లలో కూడా ఒక సందర్భాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలా జనవరి 21న ప్రపంచ కౌగిలింతల దినోత్సవం జరుపుకుంటున్నారు. కౌగిలి లేదా కౌగిలింత అనే సాంఘిక ప్రక్రియ ను ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడింది. అపరిచితులను కౌగిలించుకోవడం అనే సంప్రదాయం ఇక్కడినుంచే మొదలైంది అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెనడా ఇంగ్లాండ్ జర్మనీ లో ఈ రకమైన సంప్రదాయం మొదలైంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ సంప్రదాయం ఆ దేశాలలో కొనసాగుతోంది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం దీన్ని ఆచరిస్తూ వస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యులను స్నేహితులను కౌగిలించుకునేలా ప్రోత్సహించడం. అంతే కాదు ప్రస్తుతం ప్రజలలో ఉన్న ఒత్తిడి నీ కూడా దూరం చేస్తుంది. వారి మైండ్ ఫ్రీ గా పని చేయడానికి వారు మంచి విజయం సాధించడానికి ఈ రోజు ఉపయోగ పడుతుంది అని చెబుతున్నారు. ఈ ఫార్ములాను ఫాలో అవుతూ చాలామంది ఒత్తిడినుంచి దూరం అయ్యానని చెప్పారు. ఒక కౌగిలింత విలువ చాలా ఉంది అని కొంతమంది వెల్లడించారు.
విలువైన కౌగిలికి వెల..
బాధలో ఉన్నవారికి ప్రేమగా ఓ కౌగిలింత ఇచ్చినందుకు రూ.7 వేలు తీసుకుంటున్నారు. ఇది వింతగా ఉన్నా నిజం. ఇంగ్లాండ్ కు చెందిన ట్రెవర్ హూటన్ ఒక ప్రొఫెషనల్ కౌగిలింత అందించే వ్యక్తిగా పేరు సంపాదించాడు. బాధలో ఉన్నవారికి అతను ఒక గంట పాటు ప్రేమతో హగ్ ఇచ్చి ఓదార్చుతాడు. ఇందుకు అతను రూ.7 వేలు తీసుకుంటున్నాడు.
Also Read: Pawan Kalyan New Look: అభిమానులను భయపెడుతున్న పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్
అతని కౌగిలిలో ఏముంది..
అతని కౌగిలింతలో ఏముందని అనుకోవచ్చు కానీ.. ట్రెవర్ హూటన్ హగ్ కోసం చాలా క్యూలో ఉంటారట. కొద్ది రోజుల క్రితం బ్రిటన్ లోని బ్లిస్టల్ ప్రాంతంలో కౌగిలింత వైద్యం (కడల్ థెరపీ) మొదలైంది. కొద్ది కాలానికే ఈ వైద్యానికి డిమాండ్ పెరిగింది. ట్రెవర్ హూటన్ ఈ వైద్యాన్ని మొదలు పెట్టి క్రమంగా పేరు పొందాడు. దీంతో అతడి కౌగిలింత కోసం బాధితులు తరలివస్తున్నారు. డిప్రెషన్ లో ఉన్నవారికి.. కడల్ థెరపీలో భాగంగా ట్రవర్ హూటన్ ఒంటరితనంతో బాధపడే వారిని హగ్ చేసుకుంటాడు. ఇలా అతను గంటసేపు కౌగిలించుకున్నందుకు రూ.7 వేలు తీసుకుంటున్నాడు. డిప్రెషన్‌లో ఉన్నవారికి ఉపశమనాన్ని కలిగిస్తున్నాడు. చాలా మంది తన కౌగిలింత తీసుకుని ప్రశాంతంగా వెళ్తారని చెప్పాడు.
సెక్స్ వర్క్‌గా చూస్తున్నారు..
కడల్ థెరపీ ఆనేది ఒక ప్రొఫెషనల్ మాత్రమే.. మేం ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తామని ట్రవర్ హూటన్ తెలిపాడు. అందుకే దీనిని వృత్తిగా మార్చుకున్నట్లు వివరించాడు. తమ ప్రొఫెషనల్ ను తప్పుగా భావిస్తున్నారని, ఈ వృత్తిని సెక్స్ వర్క్‌గా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేవాడు. కానీ ఇది ఏ మాత్రం అలాంటి పని కాదని ట్రవర్ హూటన్ స్పష్టం చేశాడు. ఈ ప్రపంచంలో ఎంతో మందిలో ద్వేషం ఉంది. ఒత్తిడితో ఉన్నారు. దానిని తగ్గించాలని, ప్రేమను అందరికి పంచేందుకు కడల్ థెరపీ ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. హగ్ ఒక మ్యాజిక్ లా పనిచేస్తుంది అని చెబుతున్నాడు.
Also Read:The Warrior Collections: ‘ది వారియర్’ 7 డేస్ కలెక్షన్స్.. లేటెస్ట్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ ఇవే