Horse In Train:ఇండియన్ రైల్లన్నీ కిక్కిరిసి ఉంటాయి. అందులో ప్రయాణించాలంటే రిజర్వేషన్ లేనిదే వెళ్లడం కష్టం. ఇక లోకల్ ట్రైన్లలో కనీసం నిలబడడానికి కూడా ఛాన్స్ ఉండదు. అంతలా ఇరుక్కుపోయి వెళ్లాలి. అలాంటి రష్ ఉండే రైలులో ఏకంగా ఓ యజమాని తన గుర్రాన్ని తీసుకెళ్లాడు. దాన్ని ఎవరో ఒకరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పంచుకోవడం తో వైరల్ గా మారింది.

రద్దీగా ఉండే లోకల్ ట్రైన్లలో మనుషులు నిలబడడానికే స్థలం దొరకని పరిస్థితి ఉంటుంది. మరి అంతటి రద్దీలో మనకే ప్లేసు లేకుంటే ఓ యజమాని ఏకంగా తన గుర్రాన్ని రైల్లో తీసుకెళ్లాడు. తన కడుపునింపే గుర్రాన్ని అంత దూరం ఎలా చీప్ గా తీసుకెళ్లాలో తెలియక ఇలా అధికారుల కళ్లు గప్పి గుర్రాన్ని రైలు ఎక్కించాడు.
ఇప్పటికే పెంపుడు కుక్కలు, గొర్రె పిల్లలు, మేకలను తరలించిన సందర్భాలున్నాయి. కానీ పశ్చిమ బెంగాల్ లో ఓ లోకల్ ట్రైన్ లో గుర్రాన్ని ఎక్కించి తీసుకెళ్లాడు. అది కాస్తా వైరల్ గా మారింది. ఇది చూసి షాకైన రైల్వే సిబ్బంది ఇది ఎప్పుడు జరిగింది? ఇలా ఎలా గుర్రాన్ని రైల్లోకి అనుమతించారనే విషయంపై ఆరాతీస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ లోని సీల్దా-డైమండ్ హార్బర్ లో లోకల్ ట్రైన్ లో జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. దక్షిణ 24 పరగణాస్ లోని బరీపూర్ లో ఈక్వెస్టియన్ ఈవెంట్ నుంచి గుర్రం తిరిగి వస్తున్నట్టు సమాచారం. మనుషులకే నిలబడడానికి ఖాళీ లేని ట్రైన్ లో ఏకంగా పెద్ద గుర్రాన్ని తీసుకొచ్చాడు ఓ వ్యక్తి. తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ విషయం తూర్పు రైల్వే ప్రతినిధి వరకూ చేరింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ గా మారింది.