Aakasam Nee Haddura Song: తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా లేడీ డైరెక్టర్ సుధా కొంగర “ఆకాశం నీ హద్దు రా” సినిమా అద్భుతమైన ప్రశంసలు అందుకుని సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. నిజానికి ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇంత గొప్ప హిట్ అవుతుంది అని ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. మొత్తమ్మీద ఈ చిత్రం భారీ హిట్ అనిపించుకుంది.

విమర్శకుల నుంచి కూడా మంచి రేటింగ్స్ పొందింది. ఏది ఏమైనా సూర్యలాంటి స్టార్ ని పెట్టి.. గొప్ప ఎమోషనల్ డ్రామాని తెరకెక్కించడం.. ఒక్క సుధా కొంగరకే సాధ్యం అయింది.అయితే, ఈ సినిమాలో ఓ పాట చాలా గొప్పగా హిట్ అయ్యింది. ఇంతకీ ఏమిటి ఆ పాట ? తానే తన నానే నానే నానే తన నానే అంటూ అదిగో ఆకాశం నీ హద్దురా అని మనసు లోతుల్లోకి వెళ్ళిపోయింది.
ప్రస్తుతం ఈ పాట లిరిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మరి లిరిక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
తానే తన నానే నానే నానే తన నానే (3)
నడి గుండెల్లో నిప్పుంది మండించు దాన్ని
ఆ మంటల్లో వెలిగించు నీ రేపటిని
సుడిగుండాలు ఎదురైనా లెక్కించకు దేన్ని
ఎదురీదాలి చేరాలి లక్ష్యాలని
ఒడ్డున ఉంది రాళ్లేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు
రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాగినా నోళ్లు
నడి గుండెల్లో నిప్పుంది మండించు దాన్ని
ఆ మంటల్లో వెలిగించు నీ రేపటిని
సుడిగుండాలు ఎదురైనా లెక్కించకు దేన్ని
ఎదురీదాలి చేరాలి లక్ష్యాలని
ఒడ్డున ఉంది రాళ్లేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు
రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాగినా నోళ్లు
ముక్క చెక్కలుగా విరిచేయ్ నీకెదురుపడిన చిక్కులనీ
ఉక్కు రెక్కలతో ఎగరే నిన్ను నమ్ముకున్న నీ కలని
తానే తన నానే తానా నానే తానా నానే
అదిగో ఆకాశం నీ హద్దురా
ఇటు రా అని చిటికేసావో గెలుపెందుకు దిగి రావాలి
నీకు మరి మిగతా వాళ్ళకి తేడా ఎట్ట తెలియాలి
గర్వాంగా చెప్పుకునేందుకు నీకో ఓ కథ కావాలి
చెమటోడ్చి పొందిన విజయం పరిమళమే నిను చేరాలి
కన్ను చిన్నగున్నదంటూ చిన్న కళలు కంటామా
లేనిపోనీ పేదరికంతో వాటికి గిరి గీస్తామా
మట్టిలోకి వెళ్లిపోయామో మళ్ళి పుట్టి వస్తావా
ఉన్నదొక్క జీవితమే ఊరికే వదిలేస్తామా
మనసు పెట్టి పని చేస్తూ ఓర్పుతోనా అడుగేసేయి
నీదైన మార్పుగా నేడే సరికొత్త చరితనే రాసేయ్
తానే తననానే తననానే తననానే
తానే తననానే తననానే తననానే (2)
ఆకాశం నీ హద్దురా పద పద…

సినిమా: ఆకాశం నీ హద్దురా
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి
మ్యూజిక్: ప్రకాష్ కుమార్
సింగర్: అనురాగ్ కులకర్ణి