Homeక్రైమ్‌Karnataka Haveri District: సంతూర్ సోప్ యాడ్ లాంటి పెళ్ళామని మురిసిపోయాడు.. కానీ, ఆ తర్వాతే...

Karnataka Haveri District: సంతూర్ సోప్ యాడ్ లాంటి పెళ్ళామని మురిసిపోయాడు.. కానీ, ఆ తర్వాతే అతడి ఫ్యూజులు ఎగిరిపోయాయి!

Karnataka Haveri District: అందమైన అమ్మాయి భార్యగా రావాలని ప్రతి ఒక్క మగాడు కోరుకుంటాడు. అందమైన భార్య పక్కన ఉంటే జీవితమంతా స్వర్గం లాగా ఉంటుందని భావిస్తుంటాడు. కానీ కొన్నిసార్లు ఆ అందమే ఎదురు తంతుంది. చివరికి చేయాల్సిన నష్టాన్ని చేసి వెళ్తుంది. ఇతడికి కూడా అటువంటి అనుభవమే ఎదురయింది.

అది కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా రాణి బెన్నూరు తాలూకా తమ్మిన తమ్మిన కట్టి లో రవి అనే వ్యక్తి తన కుటుంబంతో జీవిస్తున్నాడు. ఇతడికి మూడు పదుల వయసు దాటుతున్నప్పటికీ వివాహం జరగలేదు. ఈ నేపథ్యంలో అనేక చోట్ల తనకు కావలసిన జోడి కోసం వెతికాడు. ఎక్కడ కూడా ఉపయోగ లేకపోవడంతో.. మధ్యవర్తిని సంప్రదించాడు. దీంతో అతడు ఒక సంబంధం చూపించాడు. అయితే ఆ అమ్మాయికి ఎవరూ లేరని మధ్యవర్తి చెప్పడంతో.. రవి బాధపడ్డాడు. అయినప్పటికీ తనకు నచ్చిన అమ్మాయి.. అందంగా ఉన్న అమ్మాయి భార్యగా వస్తుంటే ఎగిరి గంతులు వేశాడు.

ఆ తర్వాత చూపులు జరిగాయి. రవికి అమ్మాయి.. అమ్మాయికి రవి నచ్చాడు. ఒక మంచి రోజు చూసుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆ అమ్మాయి రవికి అనేక షరతులు పెట్టింది. తనకు కొన్ని ఖర్చులు ఉన్నాయని 2.5 లక్షలు అతని దగ్గర నుంచి వసూలు చేసింది. అనంతరం రవికి, ఆ అమ్మాయికి వారం క్రితం ఓ గుడిలో వివాహం జరిగింది.

వివాహం అనంతరం రవి, ఆ మహిళ దాంపత్య జీవితాన్ని మొదలుపెట్టారు. తన భార్య గురించి బంధువుల దగ్గర రకరకాలుగా చెప్పాడు రవి.. చివరికి ఇటీవల ఆ యువతికి ఫోన్ వచ్చింది. సమయంలో ఆమె వేరే గదిలో ఉంది. ఈ నేపథ్యంలో రవి ఆ ఫోన్ ఎత్తాడు. ” అమ్మా” అంటూ అవతల వైపు నుంచి ఒక పాప గొంతు వినిపించింది. దీంతో రవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. “మీరు ఎవరు? ఆమెను అమ్మ అని ఎందుకు పిలుస్తున్నారు” అని రవి ప్రశ్నించాడు. దీంతో ఆ పాప ఈసారి రవి మరింత ఆశ్చర్యపోయే విధంగా సమాధానం చెప్పింది. ” ఆమె మా అమ్మ.. ఒకసారి ఫోన్ ఇవ్వండి” అంటూ ఆ పాప గొంతుకు, మరో గొంతు కూడా జత అయింది. దీంతో రవి ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాడు.

ఆ ఫోన్ సంభాషణ ముగిసిన తర్వాత ఆమెను రవి నిలదీశాడు. ఈ క్రమంలో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. స్థానికులు సహకరించడంతో ఆమెను రవి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళను హలగిరి పోలీసులకు అప్పగించాడు. ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం రవిని మాత్రమే కాకుండా.. ఇంకా ఎవరినైనా మోసం చేసిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper
Exit mobile version