Dhee 15 Prabhu Deva : ఢీ 15 జడ్జిగా ప్రభుదేవా..వైరల్ అవుతున్న లేటెస్ట్ ప్రోమో

Dhee 15 Prabhu Deva :  సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ డాన్స్ షో ‘ఢీ’ ఈటీవీ ఛానల్ లో ఇప్పటి వరుకు 14 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది..ఈ 14 సీజన్స్ ద్వారా టాలీవుడ్ కి ఎంత మంది కొరియోగ్రాఫేర్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు..అంతటి చరిత్ర ఉన్న షో ఇది..ఇటీవలే 14 వ సీజన్ గ్రాండ్ ఫినాలే ముంగించుకుంది ఈ డాన్స్ షో..ఈ గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిధి గా మాస్ […]

Written By: NARESH, Updated On : December 7, 2022 8:44 pm
Follow us on

Dhee 15 Prabhu Deva :  సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ డాన్స్ షో ‘ఢీ’ ఈటీవీ ఛానల్ లో ఇప్పటి వరుకు 14 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది..ఈ 14 సీజన్స్ ద్వారా టాలీవుడ్ కి ఎంత మంది కొరియోగ్రాఫేర్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు..అంతటి చరిత్ర ఉన్న షో ఇది..ఇటీవలే 14 వ సీజన్ గ్రాండ్ ఫినాలే ముంగించుకుంది ఈ డాన్స్ షో..ఈ గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిధి గా మాస్ మహారాజ రవితేజ హాజరయ్యాడు..ఇక జతిన్ తన అద్భుతమైన డాన్స్ తో టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

ఇక అతి త్వరలోనే 15 వ సీజన్ ప్రారంభం కానుంది..ఇప్పటి వరుకు జరిగిన సీజన్స్ ఒక ఎత్తు అయితే..ఈ 15 వ సీజన్ మరో ఎత్తు..ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సీజన్ ని నిర్వహించబోతుంది మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్..ఇప్పటికే ఈ సీజన్ ని నిర్వహించేందుకు కొత్త వాళ్ళ కోసం ఆడిషన్స్ చేస్తున్నారు..ఇది ఇలా ఉండగా ఈ సీజన్ కి సంబంధించి మరో వార్త సోషల్ మీడియా లో సెన్సేషన్ సృష్టిస్తుంది.

అదేమిటి అంటే ఈ 15 వ సీజన్ కి జడ్జి గా ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పిలవబడే ప్రభుదేవా ఉండబోతున్నాడు..దీనికి సంబంధించిన ప్రోమో ని ఇటీవలే విడుదల చెయ్యగా అది యూట్యూబ్ లో తెగ వైరల్ గా మారిపోయింది..ఇప్పటి వరుకు ప్రభుదేవా సౌత్ లో నిర్వహిస్తున్న డాన్స్ షోస్ లో న్యాయనిర్ణేతగా ఎప్పుడు వ్యవహరించలేదు..మొట్టమొదటిసారి ఆయన ఆ బాధ్యతని చేపట్టబోతున్నాడు..అది కూడా తెలుగు లో మోస్ట్ పాపులర్ డాన్స్ షోస్ లో ఒకటిగా నిలిచిన ఢీ షో అవ్వడం విశేషం.

ఇక ప్రభుదేవా తో పాటుగా మరో పాపులర్ కొరియోగ్రాఫేర్ కూడా ఈ సీజన్ లో న్యాయనిర్ణేతగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది..ఇక అన్ని సీజన్స్ లాగానే ఈ సీజన్ లో కూడా డాన్స్ మధ్యలో ఎంటర్టైన్మెంట్ స్కిట్స్ ఉండనున్నాయి..సుడిగాలి సుధీర్ మళ్ళీ ఈ సీజన్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే టాక్ గట్టిగ వినిపిస్తుంది..ఈ సీజన్ కి సంబంధించిన మరికొన్ని విషయాలు త్వరలోనే అధికారికంగా తెలియనుంది.