
Posani Krishna Murali Health: ఎన్నో రకాల విభిన్నమైన పాత్రలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పర్చుకున్న నటుడు పోసాని కృష్ణ మురళి. కేవలం నటుడిగా మాత్రమే కాదు రచయితగా మరియు దర్శకుడిగా కూడా ఆయన గొప్పగా రాణించాడు. ఏడాదికి కనీసం 6 సినిమాల్లో నటించే పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్యం తో ఆసుపత్రి పాలయ్యాడు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇటీవలే పూణే లో ఒక సినిమా షూటింగ్ లో పాల్గొన్న పోసాని కృష్ణ మురళి కి కరోనా సోకింది. నిన్ననే హైదరాబాద్ కి చేరుకున్న పోసాని AIG హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. కరోనా ప్రారంభం అయ్యినప్పటి నుండి పోసాని కి ఇది మూడవసారి అటాక్ ఇవ్వడం.రెండు సార్లు క్షేమంగా బయటపడ్డ పోసాని మూడవ సారి కూడా క్షేమంగా బయటపడుతాడని ఆశిస్తున్నారు ఆయన అభిమానులు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పట్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు డాక్టర్లు.

ఇక పోసాని కృష్ణ మురళి చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఒకప్పుడు ప్రతీ ఏడాది చేతిలో కనీసం 8 సినిమాలు ఉండేవి.గత ఏడాది కూడా ఆయన 8 సినిమాల్లో నటించాడు.కానీ ఈ ఏడాది మాత్రం ఆయనకీ ఆశించిన స్థాయిలో సినిమాలు దక్కడం లేదు.రీసెంట్ గా విడుదలైన కిరణ్ సబ్బవరం ‘మీటర్’ సినిమాలో కనిపించాడు పోసాని, ఈ చిత్రం తర్వాత రెండు సినిమాల్లో నటించడానికి సంతకం చేసాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన డైరీ మొత్తం ఖాళీ అయిపోయింది.
పవన్ కళ్యాణ్ మీద మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినట్టు,ఆడపిల్లల్ని కూడా వదలకుండా బూతులు తిట్టినందుకు కాను, సినిమా ఇండస్ట్రీ ఈయనని దాదాపుగా వెలివేశారు. ఎవరో ఒకరిద్దరు తప్ప ఈయనతో ఇంతకు ముందు లాగ పెద్ద డైరెక్టర్స్ మరియు పెద్ద హీరోలు సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇదంతా పక్కన పెడితే ఆయన కరోనా నుండి తొందరగా కోలుకొని బయటకి రావాలని, యదావిధిగా తన సినిమాలు చేసుకోవాలని ఆశిద్దాం.