
Akira Nandan: హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. పవన్ కళ్యాణ్ కి మాత్రం భక్తులు ఉంటారు. ఈ విషయాన్ని అభిమానులే కాదు ప్రముఖులు కూడా ఒప్పుకున్నారు. పవన్ ని అంతగా అభిమానించే జనాలు ఉన్నారు. ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రేమించే అభిమానులు వారసుడు విషయంలో ఎంత క్రేజీ ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. అకీరా నందన్ ని పవన్ నటవారసుడిగా అభిమానులు భావిస్తున్నారు. అకీరా టీనేజ్ కి వచ్చేయగా ఆయన ప్రతి కదలిక గమనిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడని సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు.
అయితే అకీరా ఎంట్రీ జరిగిపోయింది. ఆయన త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే నటుడిగా కాదు. మ్యూజిక్ డైరెక్టర్ గా. మీరు విన్నది నిజమే… అకీరా మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తాడు. ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ విడుదలకు సిద్ధం అవుతుంది. అకీరా మొదటి ప్రయత్నంగా ఓ షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ అందించారు. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ‘రైటర్స్ బ్లాక్’. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
అకీరా నందన్ ఇచ్చిన బీజీఎం అదిరిపోయింది. చాలా ప్రొఫెషనల్ గా ఉంది. ఇరవై ఏళ్ళు కూడా దాటని అకీరా ఈ స్థాయి మ్యూజిక్ ఇవ్వడం నిజంగా గర్వించదగ్గ విషయం. కార్తీక్ యార్లగడ్డ ప్రయోగాత్మకంగా ఈ షార్ట్ ఫిలిం రూపొందించారు. కాన్సెప్ట్ కి తగ్గట్లు అకీరా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు . రైటర్స్ బ్లాక్ షార్ట్ ఫిల్మ్ ప్రోమో వైరల్ అవుతుంది.

అయితే ఇది అభిమానులను నిరాశపరిచే అంశమే. వారు అకీరాను హీరోగా చూడాలని అనుకుంటున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద అకీరా హీరో ఇజం చూసి చొక్కాలు చించుకోవాలని ఆశపడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా అకీరా ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా ఫ్యాన్స్ కి సంతృప్తి ఇవ్వదు. నిజానికి హీరోగా అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
విడాకులు అనంతరం అకీరా నందన్ తల్లి రేణు దేశాయ్ వద్ద పెరిగాడు. ఆమె అకీరాకు మ్యూజిక్ నేర్పించారు. అకీరా పియానో గొప్పగా ప్లే చేస్తాడు. పవన్ కళ్యాణ్ కూతురు ఆద్యకు కూడా కొన్ని కళల్లో ప్రావీణ్యం ఉంది. తాను మంచి ఫోటోగ్రాఫర్ అని రేణు దేశాయ్ గతంలో చెప్పారు.