Chandu Sai: ప్రముఖ యూట్యూబర్ చందూ సాయి అరెస్ట్ ఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఓ యువతి ఫిర్యాదు మేరకు చందూ మీద పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేశారు. చందూ సాయి యూట్యూబర్ గా పాప్యులర్. పక్కింటి కుర్రాడు పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన చందూ, పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు చేశాడు. ఇతడికి మంచి ఫాలోయింగ్, పాపులిరిటీ ఉంది. అభిమానులు కూడా ఉన్నారు.
కాగా చందూ సాయి మీద ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వాడుకున్న చందూ సాయి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేరుకొన్నారు. యువతి కంప్లైంట్ ఆధారంగా చందూ సాయిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చందూ సాయి సాయిపై సెక్షన్ 320, 376 (2)(n) అండ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ వంటి బలమైన కేసులు నమోదు చేశారు.
తన ఛానల్ లో అవకాశాల పేరుతో సదరు యువతిని సాయి చంద్ లొంగదీసుకున్నాడని సమాచారం. ఈ కేసు పూర్వాపరాలు, పూర్తి సమాచారం అందాల్సి ఉంది. చందూ సాయి అరెస్ట్ సంగతి తెలిసిన అతని అభిమానులు షాక్ అయ్యారు. ఒక యువతిని మోసం చేసిన చందూ సాయి మీద సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
చిత్ర పరిశ్రమ అంటేనే మోసాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా నటులు కావాలనుకున్న అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. క్యాస్టింగ్ కౌచ్ అనేది పరిశ్రమలో ఒప్పుకోవాల్సిన నిజం. కొందరు హీరోయిన్స్ దీనిపై ఆరోపణలు చేసినా నియంత్రించే చర్యలు తీసుకోవడం లేదు.