https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలవాలని అభిమాని సాహసం… ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మొదట్లో ప్రశాంత్ ని అందరూ టార్గెట్ చేశారు. కానీ ఆ సమయంలో శివాజీ, యావర్ అండగా నిలిచారు. తర్వాత ప్రశాంత్ పవర్ అస్త్ర సాధించాడు.బిగ్ బాస్ హౌస్ కి మొదటి కెప్టెన్ అయ్యాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2023 / 02:28 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తానేంటో నిరూపించుకున్నాడు. సోషల్ మీడియాలో రైతు బిడ్డగా ఫేమస్ అయిన పల్లవి ప్రశాంత్ .. బిగ్ బాస్ లో అవకాశం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు. మొత్తానికి సీజన్ 7 లో అవకాశం దక్కింది. ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లో కి వెళ్లి సెలెబ్రెటీ గా మారాడు. తనదైన శైలిలో ఆటను ప్రదర్శిస్తూ బయట మంచి ఫ్యాన్ బేస్ సంపాదించాడు.

    మొదట్లో ప్రశాంత్ ని అందరూ టార్గెట్ చేశారు. కానీ ఆ సమయంలో శివాజీ, యావర్ అండగా నిలిచారు. తర్వాత ప్రశాంత్ పవర్ అస్త్ర సాధించాడు.బిగ్ బాస్ హౌస్ కి మొదటి కెప్టెన్ అయ్యాడు. ఎవిక్షన్ పాస్ కూడా ప్రశాంత్ కె దక్కింది. అమర్ దీప్ మొదటి నుంచి ప్రశాంత్ ని ఎటాక్ చేస్తూనే ఉన్నాడు. ఎదుటి వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మర్యాద మర్చిపోయి ప్రశాంత్ ప్రవర్తించలేదు. అదే అతనికి జనాల అభిమానాన్ని తెచ్చి పెట్టింది.

    ఇక మరో రెండు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రశాంత్ విన్నర్ అవ్వాలని అతని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని పల్లవి ప్రశాంత్ గెలవాలని సాహసానికి పూనుకున్నాడు. చిట్యాల గ్రామానికి చెందిన ప్రశాంత్ వీరాభిమాని సైకిల్ యాత్ర చేపట్టాడు. చిట్యాల నుండి బిగ్ బాస్ హౌస్ వరకు ఆయన సైకిల్ మీద రానున్నాడు. మొత్తంగా 150 కిలోమీటర్లు పూర్తి చేయనున్నాడు.

    ఒక అభిమాని బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావాలని యాత్ర చేయడం ఇదే మొదటి సారి. అయితే అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ని ఎటాక్ చేస్తున్నాడు. ప్రశాంత్ ని చిన్నచూపు చూస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడని ఆ అభిమాని ఆవేదన వ్యక్తం చేసాడు. అమర్ అతిగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నాడు. మరోవైపు ఓటింగ్ లో పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడని తెలుస్తుంది. టైటిల్ ఎవరు కొడతారనే ఉత్కంఠ నడుస్తుంది.