https://oktelugu.com/

Kalki Movie: హాలీవుడ్ లో ఘన కీర్తిని అందుకున్న కల్కి మూవీ…

Kalki Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి సినిమాలు లేవు. మనం మాత్రం ఎందుకు అలాంటి సినిమాలు చేయలేమనే ఉద్దేశ్యం తోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని అల్లుకున్న ఒక కథతో కల్కి సినిమాని తెరకెక్కించడం...

Written By:
  • Gopi
  • , Updated On : July 2, 2024 / 05:30 PM IST

    Kalki movie received great fame in Hollywood

    Follow us on

    Kalki Movie: ప్రస్తుతం తెలుగు వాడి సత్తా ఏంటనేది హాలీవుడ్ జనాల దాకా చేరుకుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ‘కల్కి’ సినిమా హాలీవుడ్ మేకర్స్ ను సైతం అలరించిందనే చెప్పాలి. ఈ సినిమా హాలీవుడ్ లో కూడా ప్రేక్షకుల మెప్పు పొందడమే కాకుండా అక్కడి సినిమా మేకర్స్ కూడా ఈ సినిమా మీద ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు…ఇక హాలీవుడ్ ప్రేక్షకులకి మార్వెల్, డీసీ లాంటి విజువల్ వండర్ మూవీస్ ఉన్నాయి.

    కానీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి సినిమాలు లేవు. మనం మాత్రం ఎందుకు అలాంటి సినిమాలు చేయలేమనే ఉద్దేశ్యం తోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని అల్లుకున్న ఒక కథతో కల్కి సినిమాని తెరకెక్కించడం అనేది నిజంగా మంచి విషయం అనే చెప్పాలి. ఇక హైలీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది…

    ఇక ఇదిలా ఉంటే ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థలు అయిన డెడ్ లైన్, కొలీడార్ లాంటివి సైతం మన కల్కి సినిమా గురించి ఆర్టికల్స్ రాయడం అనేది ఇప్పుడు ఒక గొప్ప కీర్తి గా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే హాలీవుడ్ వాళ్లు మన సినిమాలని చూస్తారా అనే డౌట్ అయితే అందరిలో ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏకంగా మన సినిమా అద్భుతంగా ఉందని ఆర్టికల్స్ రాసే స్థాయికి మన సినిమా వెళ్లడం అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతానికి ఈ సినిమా అటు హాలీవుడ్ లోనూ, ఇటు ఇండియాలోను కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనే చెప్పాలి…

    ఇక ప్రభాస్ ఇప్పటికే బాహుబలి సినిమాతో అక్కడ పెను ప్రభంజనాన్ని సృష్టించాడు కాబట్టి ఈ సినిమాలో కూడా ప్రభాస్ ఉండటం వల్ల ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది… ఇక మొత్తానికి అయితే మన తెలుగు సినిమా కూడా ఇప్పుడిప్పుడే హాలీవుడ్ లో పాగా వేస్తుందనే చెప్పాలి.