
Pop singer Smita : పాప్ సింగర్ గా కోట్లాది మంది అభిమానుల ఆధారణని దక్కించుకున్న గాయని స్మిత..ఎస్ పీ బాలసుబ్రమణ్యం అద్వర్యం లో ఈటీవీ లో ప్రఖ్యాతి గాంచిన ‘పాడుతా తియ్యగా’ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న స్మిత కి ఆ తర్వాత టాలీవుడ్ లో ప్లే బ్యాక్ సింగర్ గా మంచి అవకాశాలు వచ్చాయి, ఛార్మి ప్రధాన పాత్ర లో MM కీరవాణి సంగీత సారథ్యం లో వచ్చిన ‘అనుకోకుండా ఒకరోజు’ ఆల్బం లో ‘ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని’ అనే పాట పాడి ఫిలిం ఫేర్ అవార్డుని కూడా గెలుచుకున్న ఈమె , ఆ తర్వాత ఎన్నో వందల సినిమాలకు ప్లే బ్యాక్ సింగర్ గా, మరియు ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా తళుక్కుమని మెరిసింది, అంతే కాదు విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘మల్లీశ్వరి’ లో ఆమె విలన్ గా కూడా చేసింది.
అలా ఎన్నో సినిమాలకు గాయని గా గొప్ప పేరు తెచ్చుకున్న స్మిత ఈమధ్య కాలం లో టీవీ చానెల్స్ లో ప్రసారమయ్యే కొన్ని సింగింగ్ షోస్ కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది..రీసెంట్ గానే ఆమె సోనీ లివ్ ఛానల్ లో ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ షో ని నిర్వహించింది, ఈ షో మొదటి సీజన్ చివరి ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.
ఈ ఎపిసోడ్ కి సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ వచ్చింది.రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎపిసోడ్ కోసం రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసాము..ఆయన మొదట వస్తానని చెప్పారు కానీ, ఈ టైం లైన్ లో ప్లాన్ చేసుకోండి అన్నారు..ఆయన చెప్పిన మాటకి గౌరవం ఇచ్చి మీ ఇష్టం సార్ అని చెప్పి వచ్చేసాను,ఆయనతో ప్లాన్ చెయ్యాల్సింది కానీ ఈలోపే సీజన్ ముగిసిపోయింది..అదొక్కటే నన్ను నిరాశకి గురి చేసిన సంఘటన’ అంటూ చెప్పుకొచ్చింది స్మిత.