Homeజాతీయ వార్తలుMysterious Tunnels : దేశంలో అంతుచిక్కని సొరంగాలు.. వాటి రహస్యాలు

Mysterious Tunnels : దేశంలో అంతుచిక్కని సొరంగాలు.. వాటి రహస్యాలు

Mysterious Tunnels : వెనుకటికి ఓ రాక్షసుడు భూమి మొత్తాన్ని నాశనం చేయాలని చూస్తే మహా విష్ణువు వరాహ రూపం ధరించి తన కోరల ద్వారా ఆ భూమిని రక్షించాడు. మరే ఇతర రాక్షసుల కన్ను భూమి మీద పడకూడదని విశ్వం లోగుట్టు సముద్ర గర్భం లో దాచాడు అని పురాణ ఇతి హాసాలు చెబుతున్నాయి. ఇది నిజం అని నమ్మేవారు ఎంతో…నమ్మని వారు అంతే మంది ఉన్నారు. కానీ నిజ జీవితం లోనూ ఇలాంటి రహస్యాలు, అంతు చిక్కని నిర్మాణాలు కోకొల్లలు. ఆ మధ్య అనంత పద్మ స్వామి గుడికి సంబంధించి నేల మాళిగలు తెరవాలని అప్పట్లో కొందరు కోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడి పరిస్థితులు, నేల మాళిగలకు నాగ బంధం ఉన్నట్టు చరిత్ర కారులు చెప్పడంతో తెరిచే ప్రక్రియ ఆగిపోయింది. అంటే ఇప్పటి టెక్ కాలంలోనూ అది సాధ్యం కావడం లేదూ అంటే కాలాతీతమైనది ఏదో ఉన్నట్టు లెక్క. ఇలాంటి అచ్చేరువొందించే ఎన్నో రహస్యాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. అలాంటి వాటిని భారత పురావస్తు శాఖ ఇప్పుడు వెలికి తీసే పని లో పడింది. అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

కోల్ కతా గ్రంథాలయం
కోల్ కతా గ్రంథాలయం

-గ్రంథాలయంలో రహస్యం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్ కతాలోని జాతీయ గ్రంథాలయానికి 250 ఏళ్ల చరిత్ర ఉంది.. ఈ గ్రంథాలయాన్ని 1760లో బెంగాల్ నవాబ్ నిర్మించాడు. 1891లో దీనిని జాతీయ గ్రంథాలయంగా మార్చాడు. అయితే ఈ గ్రంథాలయం ప్రధాన ద్వారంలో ఒక రహస్య గది ఉన్నట్టు పురావస్తు శాఖ జరిపిన పరిశోధనలో తెలిసింది. 2010లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. అయితే ఈ రహస్య గది ఎందుకు నిర్మించారు? అందులో ఏమేం ఉన్నాయనేది బయటి ప్రపంచానికి తెలియదు.

ముంబైలోని జనరల్ పోస్ట్ ఆఫీస్ ముందు సొరంగం

-200 ఏళ్ల నాటి సొరంగం

ముంబైలోని జనరల్ పోస్ట్ ఆఫీస్ ముందు ఉన్న పచ్చిక బయలు కింద 200 ఏళ్ల నాటి సొరంగం ఉందని తెలిసింది. 2010లో లభించిన ఒక చిన్న రాయి ద్వారా పురావస్తు శాఖ పరిశోధన జరిపితే ఇది ఉందని తెలిసింది.. ఇదే కాకుండా సెయింట్ జార్జ్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో రెండవ సొరంగం ఉన్నట్టు కూడా తెలిసింది. ఇది ముంబై జనరల్ పోస్ట్ ఆఫీస్ కు 500 మీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు సొరంగాల ద్వారా గేట్ వే ఆఫ్ ఇండియా, బ్లూ గేట్, సెయింట్ థామస్ కేథిడ్రల్ కు మూడు వేరువేరు మార్గాలు ఉన్నాయి.

charminar golkonda tunnels

-హైదరాబాదులో రహస్య వింతలు

చార్మినార్, గోల్కొండ కోటను అనుసంధానం చేస్తూ ఒక రహస్య సొరంగం ఉంది.. ఇది 2015లో వెలుగులోకి వచ్చింది.. ఈ సొరంగం కిలోమీటర్ల పొడవు ఉంటుంది.. అయితే నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఈ సొరంగం ధ్వంసం అయింది.

anantha padmanabha tunnels

-అనంత పద్మనాభ స్వామి గుడి

కేరళలోని అనంత పద్మ స్వామి గుడికి వందల యేళ్ళ చరిత్ర ఉంది.. ఇది ట్రావెన్ కోర్ రాజ వంశీకుల చేతిలో ఉంది.. అయితే 2011లో ట్రావెన్కోర్ రాజ వంశీకులకు వ్యతిరేకంగా కేసు నమోదయింది.. వారు ఈ గుడికి సంబంధించిన ఆస్తులను సొంతానికి వాడుకుంటున్నట్టు కొంత మంది ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ కూడా చేయాలని డిమాండ్ చేశారు.. అయితే విచారణ బృందం అనేక పరిశోధనలు చేసిన తర్వాత ఇందులో ఆరు నేల మాళిగలు ఉన్నట్టు తెలిసింది.. 22 బిలియన్ డాలర్ల సంపద అందులో భద్రపరచినట్టు తెలుస్తోంది.. 18 అడుగుల వజ్రాలహరం, బంగారంతో చేసిన దేవుడి ప్రతిమలు అందులో ఉన్నట్టు సమాచారం.. ఇక లెక్కకు మిక్కిలి సంచుల్లో బంగారు నాణాలు ఉన్నట్టు దర్యాప్తు బృందం విచారణలో తేలింది. ఇవి ఎవరికి చెందాలో ఇప్పటికీ ఒక స్పష్టత లేదు.. అయితే ఈ నేల మాళిగలకు నాగబంధం ఉన్నట్టు అక్కడి పూజారులు చెప్తున్నారు.

Red fort delhi tunnels

-ఎర్రకోటలో ఎన్నో రహస్యాలు

ఢిల్లీలోని ఎర్రకోట కూడా రహస్యాల మయమే. దీనిని 17వ శతాబ్దంలో షాజహాన్ నిర్మించారు.. ఇందులో ఆరు కిలోమీటర్ల సొరంగం ఉంది. ఇది ఢిల్లీ లెజిస్లేటివ్ ను కలుపుతుంది..ఈ సొరంగాన్ని 2016లో కనుగొన్నారు.. ఈ సొరంగం రెండు మార్గాలుగా విభజింపబడి ఉంది..

Pargwal tunnel

-అసంపూర్తి సొరంగం

2014లో జమ్ములో భారత రక్షణ దళం పరుగువాల్ సొరంగాన్ని కనుగొన్నది.. ఇది 20 అడుగుల లోతులో ఉన్నది.. అయితే ఈ సొరంగం అసంపూర్తిగా నిర్మించి ఉన్నది.. భారతదేశ సరిహద్దులోకి చొరబడేందుకు దీనిని నిర్మించినట్టు తెలుస్తోంది. కారణాలు తెలియవు గాని దీన్ని అసంపూర్తిగా వదిలేశారు.

Jaigarh tunnel in Rajasthan

-రాజస్థాన్ జైగఢ్
రాజస్థాన్లోని జై గఢ్ ప్రాంతంలోని 18వ శతాబ్దంలో 325 మీటర్ల పొడవైన బహిరంగ సొరంగాన్ని నిర్మించారు. ఇది అంబర్ ప్యాలస్ ను జై గడ్ ప్రాంతాన్ని కలుపుతుంది.. దీన్ని 2011లో పర్యాటకులకు సందర్శించేలా ఏర్పాటు చేశారు.. అప్పటినుంచి ఇది ఒక సందర్శనీయ ప్రాంతంగా వెలుగొందుతోంది.

ఇక వీటి అన్నింటిని తలదన్నేలా రహస్య సైనిక స్థావరంగా 18వ శతాబ్దంలో రెండు సొరంగాలను నిర్మించారు. ఇవి గార్గాన్ ప్యాలెస్ లో ఉన్నాయి. ఈ రహస్య సొరంగాలను మూడు అంతస్తులు నిర్మించారు.. ఒక సొరంగం మూడు కిలోమీటర్ల పొడవు ఉంటుంది.. ఇది తలతాల్ ఘర్, దీకో అతని కలుపుతుంది.. మరొకటి 16 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇది గార్గాన్ ప్యాలెస్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే అప్పట్లో శత్రు దేశాల సైనికుల నుంచి రాజ్యాలను కాపాడుకునేందుకు ఇలాంటి సొరంగాలను నిర్మించినట్లు తెలుస్తోంది. దీనివల్ల సైనిక ప్రాణ నష్టాన్ని నివారించడంతోపాటు శత్రుదేశంపై మూకుమ్మడిగా దండెత్తే అవకాశం ఉంటుంది.. ఇలాంటి రహస్య సొరంగాల ద్వారా నాటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, అప్పటి భౌగోళిక పరిస్థితులు ప్రస్తుత తరానికి తెలుస్తున్నాయి.. అయితే ఇవన్నీ వెలుగులోకి వచ్చినవి మాత్రమే. రానివి కోకొల్లలు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version