Pooja Hegde: పూజా హెగ్డే కాళ్లకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ విషయం దర్శకుడు త్రివిక్రమ్ కి బాగా తెలుసు. అందుకే అల వైకుంఠపురంలో ఆమె పొడవాటి కాళ్ళను వర్ణిస్తూ ఏకంగా ఒక పాటే పెట్టాడు. అల్లు అర్జున్ రోడ్లపై జారుతూ పూజా కాళ్ళ సౌందర్యం వర్ణించడం మనం చూశాము. ఈ తరం హీరోయిన్స్ లో సెక్సీ హీరోయిన్ ఇమేజ్ పూజా సొంతం. ఒడ్డుపొడుగు కలిగి సాలిడ్ ఫిగర్ తో యువతకు పిచ్చేక్కించే గ్లామర్ ఆమె సొంతం. ఈ క్రమంలో ఆమె తాజా ఫోటో షూట్ కాకరేపుతుంది.

టైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించిన పూజా హెగ్డే హాట్ థైస్ చూపిస్తూ బోల్డ్ ఫోటో షూట్ చేసింది. కారు వెనుక సీట్లో కూర్చొని థైస్ హైలెట్ అయ్యేలా క్రేజీ ఫోజులతో రచ్చ చేసింది. పూజాను అలా చూసిన నెటిజెన్స్… మనసు పారేసుకుంటున్నారు. హాట్ కామెంట్స్ తో తమ ఫీలింగ్స్ షేర్ చేస్తున్నారు. పూజా లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
పూజా హెగ్డే లేటెస్ట్ మూవీ సర్కస్ డిసెంబర్ 23న విడుదలైంది. పీరియాడిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా సర్కస్ తెరకెక్కింది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించగా రోహిత్ శెట్టి దర్శకుడు. ఈ సినిమా దారుణమైన రేటింగ్ అందుకుంది. సినిమాలో విషయం లేదని ప్రేక్షకులు తేల్చేశారు. క్రిటిక్స్ అయితే రోహిత్ శెట్టి, రణ్వీర్ సింగ్ లను ఓ రేంజ్ లో ఏకి పారేశారు. పూజా హెగ్డే బ్యాడ్ లక్ కంటిన్యూ అయ్యింది.

సర్కస్ ఫెయిల్యూర్ తో పూజాకి 2022 వరస్ట్ ఇయర్ గా మిగిలిపోయింది. ఆమె నటించిన ఒక్క చిత్రం హిట్ కాలేదు. ఆచార్య, రాధే సహాయం, బీస్ట్… తాజాగా సర్కస్ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఈ దెబ్బతో పూజా కెరీర్ సందిగ్ధంలో పడింది. మహేష్ మూవీ నుండి తీసేసారని గతంలో వార్తలు వచ్చాయి. అదే జరిగితే పూజా కెరీర్ మరింత ప్రమాదంలో పడేది. అలా జరగలేదు. పూజా మహేష్ మూవీ షూట్ లో జాయిన్ అయ్యారు.
ప్రస్తుతం పూజా ఎస్ ఎస్ ఎం బి 28తో పాటు సల్మాన్ ఖాన్ కి జంటగా కిసీ కి భాయ్ కిసీ కా జాన్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మధ్య సల్మాన్ తో పూజా ఎఫైర్ నడుపుతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ పుకార్లను సల్మాన్ టీం ఖండించారు. ఒక ఇబ్బందుల్లో పడ్డ పూజా కెరీర్ ని సెట్ చేయాల్సిన బాధ్యత మరలా త్రివిక్రమ్ పై పడింది.