Venu swamy On Samantha: సినిమా తారల జాతకాలను బహిర్గతం చేస్తూ ఫేమస్ అయ్యారు వేణు స్వామి. సమంత విడాకుల గురించి ఆయన ముందే చెప్పారు. నాగ చైతన్య-సమంత జాతకరీత్యా కలకాలం కలిసి ఉండటం జరగదని చెప్పాడు. ఆయన చెప్పినట్లే జరిగింది. నయనతార విషయంలో కూడా ఆయన అంచనాలు నిజమయ్యాయి. వివాహం తర్వాత ఆమె కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని వేణు స్వామి చెప్పారు. పెళ్ళైన మరుసటి రోజే తిరుమల మాడ వీధుల్లో చెప్పులతో తిరిగి నయనతార ఇబ్బందుల్లో పడింది.

అలాగే సరోగసీ వ్యవహారం కూడా ఆమెను చిక్కుల్లోకి నెట్టింది. పెళ్ళైన కొద్దిరోజులకే సరోగసీ పద్దతిలో పేరెంట్స్ అయ్యామంటూ నయనతార దంపతులు ప్రకటించిన నేపథ్యంలో… చట్టాలు అతిక్రమించారంటూ తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఐదేళ్ల క్రితమే మాకు వివాహం జరిగింది. మా బిడ్డను మోసిన మహిళ కూడా బంధువే అంటూ ఆధారాలు చూపి ఈ సమస్య నుండి బయటపడ్డారు. కాగా వేణు స్వామి జాతకాలు గట్టిగా విశ్వసించే స్టార్స్ ఉన్నారు.
రష్మిక మందాన తన కెరీర్ కోసం వేణు స్వామి నివాసంలో ప్రత్యేక పూజలు చేసింది. రష్మిక జాతకం సూపర్ అన్న వేణు స్వామి భవిష్యత్ లో రాజకీయాల్లో కూడా రాణిస్తుందని చెప్పడం కొసమెరుపు. ఈ క్రమంలో సమంత ఆరోగ్యం గురించి వేణు స్వామి వ్యాఖ్యలు అభిమానుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. 2025 తర్వాత సమంత ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఏలిన నాటి శని ఆమెను ఇబ్బంది పెడుతుందని వేణు స్వామి జాతకం చెప్పారు. వేణు స్వామి కామెంట్స్ అభిమానులను భయపెడుతున్నాయి.

ప్రస్తుతం సమంత మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. ఇది ప్రాణాంతకం కాదు, అలా అని చిన్న సమస్య కూడా కాదు. నేను యుద్ధం చేయాల్సి ఉంది. ఈ మహమ్మారి నుండి నేను బయటపడతాననే నమ్మకం ఉంది, అంటూ ఓ ఇంటర్వ్యూలో సమంత వెల్లడించారు. ఇక ఆరోగ్య కారణాలతో సమంత సైన్ చేసిన సినిమాలు వదిలేసినట్లు సమాచారం. తెలుగులో సమంత శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటిస్తున్నారు. శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది విడుదల కానుంది.