Homeట్రెండింగ్ న్యూస్Couriar App Cyber Crime: కొరియర్ యాప్.. మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల సరికొత్త అస్త్రం....

Couriar App Cyber Crime: కొరియర్ యాప్.. మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల సరికొత్త అస్త్రం. క్షణాల్లో మీ అకౌంట్స్ ఖాళీ….

Couriar App Cyber Crime: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నకొద్దీ రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.. తీరా తరచి చూసుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పోలీసులు ఎన్ని రకాల జాగ్రత్త చర్యలు వివరించినప్పటికీ ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి సైబర్ ముఠా ఒకటి రెచ్చిపోతుంది. హైదరాబాద్ నగరానికి చెందిన దాడి శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ ముఠా ప్రజలను బెదిరించి రోజుకు మూడు నుంచి ఐదు కోట్ల వరకు ప్రజల ఖాతాల నుంచి ఖాళీ చేస్తోంది. ఇలా వసూలు చేసిన సొమ్మును క్రిప్టో కరెన్సీ గా మార్చి చైనా దేశానికి తరలిస్తోంది. ఇలా దేశంలోని పలు కీలక నగరాల్లో కొన్నాళ్లుగా సాగిస్తున్న ఈ ముఠాపై నెలన్నరగా ముంబై నగరానికి చెందిన పోలీసులు దృష్టి పెట్టారు. ఎట్టకేలకు ఈ ముఠా నాయకుడు దాడి శ్రీనివాసరావును విశాఖలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్లో అరెస్టు చేశారు. కరిస్తున్న కొంతమంది ముఠా నాయకులను కోల్ కతా లో తీసుకున్నారు.

ఇలా దోచేస్తారు

“మేము పోలీసులం. మీ పేరుతో ఒక కొరియర్ వచ్చింది. మీ పేరుతో ఒక కొరియర్ వచ్చింది. అందులో మాదకద్రవ్యాలు ఉన్నాయి. ఇది చాలా తీవ్రమైన నేరం.. అరెస్టు చేస్తే జీవితం మొత్తం జైల్లో ఉండాల్సి వస్తుంది. దీనిపై విచారణ చేయాలి. ఆ ప్రక్రియ మొత్తం సాగాలంటే మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో మీ వివరాలు నమోదు చేయండి. మీ బ్యాంకు ఖాతా వివరాలు కూడా ఇవ్వండి. పోతే తదుపరి జరిగే పరిణామాలకు మా బాధ్యత లేదు” మహిళలను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తారు. తమ వద్ద ఉన్న ఐడెంటిటీ కార్డులు (నకిలీ) చూపిస్తారు. ఇది నిజమే అని భావించిన బాధితులు వారు చెప్పినట్టే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని, వివరాలు నమోదు చేస్తారు. ఇక అప్పటినుంచి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి బాధితుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తారు.

ముంబై నగరంలోని బంగుర్ నగర్ లో..

సైబర్ ముఠా దోపిడి పై ముంబై నగరంలోని బంగూర్ నగర్ పోలీసులు దాదాపు 45 రోజులుగా దృష్టిపెట్టారు. తమకు వచ్చిన ఒక ఫిర్యాదు ఆధారంగా ప్రత్యేక బృందం తీవ్రంగా శోధించడం మొదలుపెట్టింది. అయితే అమాయకులైన స్త్రీల నుంచి కోట్లు దోచుకున్నది దాడి శ్రీనివాసరావు అని గుర్తించిన పోలీసులు అతడిని విశాఖపట్నం లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అరెస్టు చేశారు. అతడికి సహకరిస్తున్న సంజయ్ మండల్, అనిమిష్, మహేంద్ర రాక్డే, ముఖేష్ దివే ను కోల్ కతా లో అదుపులోకి తీసుకున్నారు.

ఇంటర్ చదివి..

విశాఖపట్టణానికి చెందిన దాడి శ్రీనివాసరావు ఇంటర్ వరకు చదువుకున్నాడు. కొద్ది రోజులపాటు సెక్యూరిటీ అధికారిగా పనిచేశాడు. తర్వాత సైబర్ నేరాలపై దృష్టి పెట్టాడు. కొంతమందిని నియమించుకుని నేరాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. ఇక ఈ ముఠా సభ్యులు మహిళలు లక్షణంగా చేసుకొని స్కైప్ లేదా వాట్సాప్ ద్వారా పోలీస్ అధికారులుగా పరిచయం చేసుకుంటారు. మీ పేరుతో కొరియర్ లో పార్సిల్ వచ్చిందని, అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని బెదిరిస్తారు. విచారణలో భాగంగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించి, వారి ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. తర్వాత వారి బ్యాంకు ఖాతాలను ఫోన్లో ఎంటర్ చేయించి, ఖాతాలను ఖాళీ చేస్తారు. ఇలా ముంబై, పుణె, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్ కతా వంటి నగరాలకు చెందిన పలువురు శ్రీనివాసరావు గ్యాంగ్ చేతిలో మోసపోయారు. ముంబై నగరంలో నమోదైన ఓ కేసులో బాధిత మహిళలకు సైబర్ నెరగాడు వీడియో కాల్ చేసినప్పుడు కాకి యూనిఫారం ధరించి మాట్లాడినట్టు తేలింది. ఈ ముఠాపై మార్చిలో ఫిర్యాదులు అందడంతో ముంబై బంగూర్ నగర్ పోలీసులు రంగాల్లోకి దిగారు. శ్రీనివాసరావు గ్యాంగ్ అమాయకుల ఖాతాల నుంచి ప్రతిరోజు సుమారు 3 నుంచి 5 కోట్ల వరకు కొల్లగొట్టి, వచ్చిన ఆ నగదును క్విప్టోప్ కరెన్సీగా మార్చి చైనాలోని ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. ఈ మోసాలకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు మొత్తం పోలీసులు సేకరించారు.. తమ వివరాలు పోలీసులు సేకరించారని తెలుసుకున్న శ్రీనివాసరావు హైదరాబాద్ లోని తన ఇంటి నుంచి తప్పించుకొని విశాఖపట్నంలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో తలదాచుకున్నాడు. అయితే అతడి కదలికలను నిశితంగా గమనిస్తున్న పోలీసులు విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు.

కళ్ళు చెదిరే డబ్బు

దాడి శ్రీనివాసరావుకు 40 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఆ ఖాతాల్లో ఉన్న కోటి 50 లక్షల ను పోలీసులు ఫ్రీజ్ చేశారు. దాడి శ్రీనివాసరావు తన భార్య ఖాతాకు 25 లక్షలు బదిలీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ మోసంలో ఆమె భార్య ప్రమేయం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి శ్రీనివాసరావు గత కొద్ది సంవత్సరాలుగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులకు చిక్కలేదు. అయితే ఈ కేసు దార్యాతుకు సంబంధించి ముంబై పోలీసులు విశాఖపట్నం పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం విశేషం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version