https://oktelugu.com/

Ramabanam Movie: ‘రామబాణం’ ని తప్పించుకున్న మెగా హీరో.. ఒప్పుకొని చేసి ఉంటే కెరీర్ పొయ్యేది!

రొటీన్ స్టోరీ అయ్యినప్పటికీ టేకింగ్ సరికొత్తగా ఉంటే ఆడియన్స్ కచ్చితంగా నెత్తిన పెట్టుకుంటారు, కానీ ఈ సినిమాలో అదే లోపించింది. ఫలితంగా డిజాస్టర్ టాక్ మరియు డిజాస్టర్ ఓపెనింగ్స్ వచ్చాయి.

Written By: , Updated On : May 6, 2023 / 12:39 PM IST
Follow us on

Ramabanam Movie: గోపీచంద్ – శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం ‘రామబాణం’.నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. గతం లో శ్రీవాస్ తో గోపీచంద్ చేసిన ‘లక్ష్యం’ , ‘లౌక్యం’ వంటి సినిమాలు కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి, ఈ సినిమా కూడా అదే రేంజ్ హిట్ అవుతుందనే నమ్మకంతో చాలా రొటీన్ స్టోరీ తీసుకొని గోపీచంద్ మార్క్ యాక్షన్ సన్నివేశాలను పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

రొటీన్ స్టోరీ అయ్యినప్పటికీ టేకింగ్ సరికొత్తగా ఉంటే ఆడియన్స్ కచ్చితంగా నెత్తిన పెట్టుకుంటారు, కానీ ఈ సినిమాలో అదే లోపించింది. ఫలితంగా డిజాస్టర్ టాక్ మరియు డిజాస్టర్ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి కేవలం కోటి రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 15 కోట్ల రూపాయిల షేర్ వసూలు చెయ్యాలి.అది అసాధ్యం అనే విషయం అందరికీ అర్థం అయిపోయింది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాని తొలుత చేయాలనుకున్నది గోపీచంద్ తో కాదట, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తో చేద్దామని అనుకున్నాడట, స్టోరీ విన్న తర్వాత ఈ కథ నాకు ఏమాత్రం సరిపడదు అని చెప్పి రిజెక్ట్ చేసాడట వరుణ్ తేజ్. దాంతో ఒక పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ నుండి తప్పించుకున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. వరుణ్ తేజ్ కి ఈమధ్య సోలో గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ లేదు, ఈ సమయం లో ఇలాంటి డిజాస్టర్ పడితే ఆయన కెరీర్ ముగిసినట్టే అనుకోవాలి.

ఇక గోపీచంద్ పరిస్థితి అత్యంత దయనీయం గా మారింది. ఆయన ఒక కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని అందరి హీరోల అభిమానులు కోరుకుంటున్నారు, ఎందుకంటే గోపీచంద్ అంటే అందరికీ ఇష్టమే,కానీ ఆ కమర్షియల్ సక్సెస్ రావడమే పెద్ద టాస్క్ అయిపోయింది, తదుపరి చిత్రం తో అయినా ఆయన బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.