PM Mudra Yojana: ఈ క్రమంలో కష్టపడి చదివి ఉద్యోగం చేసే కంటే కూడా చదువు అయిపోయిన తర్వాత వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చే వారి సంఖ్య భారీగా పెరిగింది. వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి పెట్టుబడి ప్రధాన సమస్యగా మారింది. బ్యాంకుల ద్వారా వ్యాపారం చేయడానికి రుణం తీసుకోవాలి అంటే షూరిటీ తప్పనిసరిగా ఉండాలి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి ఎటువంటి స్యూరిటీ లేకుండా రుణాలను అందిస్తుంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కోట్లాదిమంది ప్రజల కోసం అనేక పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను తీసుకొని వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది యువత వ్యాపారం వైపు ముగ్గు చూపుతుండడంతో వారికి పెట్టుబడికి అవసరమయ్యే రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పుడున్న రోజులలో ఎటువంటి హామీ లేకుండా ఎవరు కూడా డబ్బు ఇవ్వరు. కానీ కేంద్ర ప్రభుత్వం డబ్బు లేకుండా యువతకు సొంత వ్యాపారానికి రుణాన్ని అందిస్తుంది.
Also Read: ఇంటి నుంచే రూ.5 వేల పెట్టుబడితో ప్రతి నెల లక్షల ఆదాయం.. చాలా డిమాండ్ ఉన్న వ్యాపారం ఇదే..
ప్రధానమంత్రి ముద్ర రుణ పథకంలో మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి కావలసిన రుణాన్ని తీసుకోవచ్చు. ముద్ర రుణం ఇవ్వడం అనేది మీ అవసరం మరియు అర్హతను బట్టి ఉంటుంది. ఈ పథకంలో మీరు ఎటువంటి హామీ లేకుండా రుణాన్ని పొందుతారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.33 లక్షల కోట్లకు పైగా హామీలు లేకుండా రుణాలు పొందారు. ఈ పథకంలో శిశురుణం 50 వేల వరకు ఉంటుంది. అలాగే కిషోర్ రుణం 50 వేల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. తరుణ్ రుణం ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఉంటుంది. మీరు తరుణ్ రుణాన్ని తిరిగి చెల్లించడం ఆధారంగా చేసుకుని తరుణ్ ప్లస్ రుణం 20 లక్షల వరకు మీకు అందుబాటులో ఉంటుంది.
ఈ పథకంలో మీరు రుణం పొందడానికి అధికారిక వెబ్సైట్ అయిన https://udyamimitra.in లో అప్లై చేసుకోవచ్చు. వీధి వ్యాపారస్తులు వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రధానమంత్రి స్వానిధి యోజనను ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పథకం కింద కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి హామీ లేకుండా వ్యాపారం చేసుకునే వాళ్లకు రుణాలు ఇస్తుంది. అయితే దీనిని మూడుసార్లు ఇస్తారు. మొదటిసారి పదివేల వరకు రుణం ఇస్తారు. ఈ రుణాన్ని సకాలంలో మీరు చెల్లించినట్లయితే రెండోసారి 20వేల వరకు రుణం ఇస్తారు. అలాగే ఇది కూడా మీరు సకాలంలో చెల్లించినట్లయితే మూడోసారి మీకు 50,000 వరకు రుణం ఇస్తారు.