Alekhya Chitti : గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్(Alekhya Chitti Pickles) పేరునే మనం చూస్తూ ఉన్నాము. అక్కాచెల్లెళ్లు కలిసి ఇన్ స్టాగ్రామ్ లో మొదలెట్టిన ఈ పికిల్స్ వ్యాపారం పెద్ద హిట్ అయ్యింది. అంతే కాకుండా వీళ్ళు ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసే వీడియోస్ ని కూడా నెటిజెన్స్ బాగా అనుసరిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే అలేఖ్య కస్టమర్ ని బూతులు తిడుతూ వాయిస్ మెసేజ్ ని వాట్సాప్ లో పెట్టిందో, అది సోషల్ మీడియా లో లీక్ అవ్వడం వల్ల , ఆ ముగ్గురి అక్కాచెల్లెళ్ల జీవితాలు రాత్రికి రాత్రి తలక్రిందులు అయ్యింది. క్షమాపణలు చెప్తూ వీడియోలు కూడా చేసారు కానీ నెటిజెన్స్ క్షమించలేదు. ఇంకా ఆమెని బూతులు తిడుతూనే ఉన్నారు సోషల్ మీడియా లో. రీసెంట్ గానే ఆమె విడుదల చేసిన ఒక వీడియో లో ఇక మీదట వీటి గురించి నేను స్పందించను, ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తాను అని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.
Also Read : ‘బిగ్ బాస్ 9’ ఆఫర్ పై క్లారిటీ ఇచ్చిన అలేఖ్య చిట్టి..వీడియో వైరల్!
చెప్పినట్టు గానే నెగటివ్ కామెంట్స్ పై ఆమె స్పందించడం మానేసి, మళ్ళీ మామూలు జీవితంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమె అప్లోడ్ చేసిన ఒక రీల్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పటి లాగానే హాట్ అందాలను ఆరబోస్తూ, యువతకు పిచ్చి ఎక్కించేలా ఒక రీల్ ని స్టోరీ లో పెట్టగా అది బాగా వైరల్ అయ్యింది. దీనిని బట్టి చూస్తుంటే అతి త్వరలోనే ఆమె మళ్ళీ పికిల్స్ బిజినెస్ ని మొదలు పెట్టబోతోంది అనేది స్పష్టం గా సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి ఆమె ఎప్పుడు ఈ వ్యాపారాన్ని పునః ప్రారంభిస్తుంది అనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలేఖ్య హాస్పిటల్ లో ICU బెడ్ మీద చికిత్స తీసుకుంటున్నప్పుడు మిగిలిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఎంత బాదపడ్డారో మనమంతా చూసాము. అయ్యో పాపం అని కూడా నెటిజెన్స్ కొంతమంది జాలిపడ్డారు. కానీ అకస్మాత్తుగా ఈ రేంజ్ తేడాని రోజుల వ్యవధిలోనే చూపించడంతో అందరు ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. తిట్టే వాళ్ళు తిడుతూనే ఉన్నారు కానీ, వీళ్ళని అభిమానించే వాళ్ళు మాత్రం చాలా తొందరగా కోలుకున్నారు, మళ్ళీ భారీ కం బ్యాక్ ఇవ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే నా అన్వేషణ ఫేమ్ అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ లో వీళ్ళ గురించి చెప్తూ, పికిల్స్ వ్యాపారం ఆపేశారని, త్వరలోనే స్వీట్ బిజినెస్ పెట్టబోతున్నారని, లడ్డూల తయారీ చేయబోతున్నారని, ఇక మీదట ఆ వ్యాపారమే చేస్తారంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ ముగ్గురు అక్కచెల్లల్లో ఒకరికి బిగ్ బాస్ సీజన్ 9 లో అవకాశం వచ్చే ఛాన్స్ ఉందట, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
Also Read : అలేఖ్య చిట్టి పికిల్స్ పై సెలబ్రెటీ షాకింగ్ వీడియో..