Beer Bottle: బీర్‌ బాటిల్‌లో ప్లాస్టిక్‌ స్పూన్‌.. ఎక్కడో తెలుసా?

వర్షాకాలం మొదలైనా.. మండుతున్న ఎండలకు తెలంగాణలో ఇంకా బీర్ల కొరత తీరడం లేదు. మందుబాబులు వేడి నుంచి చిల్‌ అవడానికి చిల్డ్‌ బీర్లనే లాగించేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా డోన్‌ నగరంలోని బేతంచెర్ల సర్కిల్‌ వద్ద ఉన్న వైన్‌సాప్‌లో బీర్‌ కొనుగోలు చేసిన కస్టమర్‌కు అందులో ప్లాస్టిక్‌ స్పూన్‌ కనిపించింది.

Written By: Raj Shekar, Updated On : June 27, 2024 12:50 pm

Beer Bottle

Follow us on

Beer Bottle: ఇటీవల హోటళ్లు, హాస్టళ్లలోని ఆహారంలో బొద్దింకలు, బల్లులు ప్రత్యక్షం అవుతున్నాయి. మరోవైపు నిల్వ చేసిన ఆహార పదార్థాలను వండి పెడుతున్న హోటళ్లపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద హోటళ్లలో కూడా పాచిపోయిన, నిల్వ చేసిన, కల్తీ ఆహార పదార్థాలను గుర్తించారు. కొన్ని హోటళ్లను సీజ్‌ కూడా చేశారు. అయినా హోటళ్ల తీరులో మార్పు రావడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఓ బీర్‌ బాటిల్‌లో ప్లాస్టిక్‌ స్పూన్‌ ప్రత్యక్షమైంది. గతంలో బీర్‌ బాటిళ్లలో పాములు, బొద్దింకలు, బల్లుల అవశేషాలు వచ్చాయి. తాజాగా సీల్డ్‌ బీర్‌ బాటిల్‌లో ప్లాస్టిక్‌ స్పూన్‌ ప్రత్యక్షమైంది.

బీర్లకు తగ్గని డిమాండ్‌..
వర్షాకాలం మొదలైనా.. మండుతున్న ఎండలకు తెలంగాణలో ఇంకా బీర్ల కొరత తీరడం లేదు. మందుబాబులు వేడి నుంచి చిల్‌ అవడానికి చిల్డ్‌ బీర్లనే లాగించేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా డోన్‌ నగరంలోని బేతంచెర్ల సర్కిల్‌ వద్ద ఉన్న వైన్‌సాప్‌లో బీర్‌ కొనుగోలు చేసిన కస్టమర్‌కు అందులో ప్లాస్టిక్‌ స్పూన్‌ కనిపించింది. బీర్‌ బాటిల్‌ కొనుగోలు చేసిన సమయంలోనే కస్టమర్‌కు అందులో ఏదో ఉన్నట్లు కనిపించింది. సరిగా కనిపించకపోవడంతో సెల్‌ఫోన్‌ లైట్‌ ఓపెన్‌ చేసి చూడగా అందులో తెల్ల ప్లాస్టిక్‌ స్పూన్‌ చూసి షాక్‌ అయ్యాడు.

తమకు సంబంధం లేదన్న షాప్‌ ఓనర్‌..
వెంటనే యువకుడు షాప్‌ వద్దకు వెళ్లి.. ఇందులో స్పూన్‌ ఉందని ప్రశ్నించాడు. దాంతో తమకు సంబంధం లేదని నిర్వాహకులు తెలిపారు. తాము అమ్మకం వరకే పరిమితమని తయారీతో సంబంధం లేదని పేర్కొన్నారు. దీంతో యువకుడు ఎక్సైజ్‌ ఆఫీసులో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లాడు. అయినా అక్కడున్న వారు స్పందించలేదు. దీంతో యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

చూసుకోకుండా తాగితే..
ఈ సందర్భంగా యువకుడు మాట్లాడుతూ తాము బీర్‌ చూసుకోకుండా తాగితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇందులో స్పూన్‌ కాకుండా బల్లి లాంటివి వస్తే తమ ఆరోగ్యం ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. తయారీదారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కోరాడు.