Pawan Kalyan- Nithin: ఒక పక్క రాజకీయాలు మరోపక్క సినిమాలు అంటూ క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..జనసేన పార్టీ ని ఒకపక్క సంస్థాగతం గా బలపరుస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ ని సెట్ చేస్తూ అభిమానులకు మంచి కిక్ ఇస్తున్నాడు..వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ఆయన హీరో గా నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’.

పీరియాడిక్ జానర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెల్సిందే..ఈ సినిమాతో పాటుగా ఆయన ఈ నెల లోనే తమిళం లో సూపర్ హిట్ అయినా ‘వినోదయ్యా చిత్తం’ రీమేక్ లో నటించబోతున్నాడు..మరోపక్క డైరెక్టర్ హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు డైరెక్టర్ సుజిత్ తో #OG అనే సినిమాలు చేస్తున్నాడు.
వీటితో పాటుగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా లైన్ లో పెట్టినట్టు సమాచారం..పవన్ కళ్యాణ్ వీరాభిమాని మరియు యంగ్ హీరో నితిన్ త్వరలోనే తన సొంత బ్యానర్ ‘శ్రేష్ట్ మూవీస్’ ద్వారా పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాని నిర్మించబోతున్నాడట..ఈ చిత్రానికి క్రేజీ యంగ్ డైరెక్టర్ ని కూడా తీసుకున్నట్టు సమాచారం.

ఎప్పుడో తన బ్యానర్ లో నటించాల్సిందిగా పవన్ కళ్యాణ్ దగ్గర మాట తీసుకున్న నితిన్ కి పవన్ కళ్యాణ్ ఇటీవలే కాల్ చేసి స్క్రిప్ట్ సిద్ధం చేసుకో అని చెప్పాడట..ఇప్పుడు ఈ న్యూస్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది..పవన్ కళ్యాణ్ ని ఎంతగానో అభిమానించే నితిన్ కి ఇప్పుడు ఆయనతోనే సినిమా చేసే ఛాన్స్ రావడం తో నితిన్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది అట..ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియనున్నాయి.