
Pawan Kalyan: ఒక పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలు అంటూ ఎప్పుడూ బిజీ గా ఉండే పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం స్వల్పం గా అనారోగ్యం వచ్చినట్టు తెలుస్తుంది.అందుకే ఈమధ్యనే ప్రారంభం అవ్వాల్సిన తమిళ చిత్రం ‘వినోదయ్యా సీతం’ రీమేక్ షూటింగ్ వాయిదా పడింది.ఈ సినిమా కోసం గా పవన్ కళ్యాణ్ గత కొద్దీ రోజుల నుండి ప్రత్యేకమైన డైట్ తీసుకుంటూ ఉన్నాడు.క్యారక్టర్ కి తగ్గట్టుగా స్లిమ్ గా కనపడాల్సిన అవసరం ఉండడం తో ఆయన అలా చేస్తున్నాడు.
అయితే ఈమధ్యనే పవన్ కళ్యాణ్ స్వల్పం గా అనారోగ్యానికి గురైనట్టు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే ఈ సినిమా షూటింగ్ ని వాయిదా వేసారట.జనవరి నెల వరకు ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కి తాత్కాలిక బ్రేక్ ఇచ్చి #OG మరియు వినోదయ్యా సీతం రీమేక్ డేట్స్ కేటాయించాడు.
మరోపక్క ఆయన తన రాజకీయ కార్యకలాపాలను కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు.వచ్చే నెలాఖరు నుండి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తన వారాహి వాహనం మీద రాజకీయ పర్యటన చెయ్యబోతున్నాడు.అందుకోసం ముందుగా ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధం చెయ్యమని జనసేన ముఖ్య నాయకులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చాడట.కానీ ఇప్పుడు ఆయన అనారోగ్యానికి గురవ్వడం తో షూటింగ్స్ తో పాటుగా ఈ పర్యటన కూడా వాయిదా పడే అవకాశం ఉందని చెప్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకొని తన సినీ మరియు రాజకీయ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనాలంటూ ఆ దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు.అనారోగ్యం కారణంగానే నిన్న తారకరత్న ని చివరి చూపు చూసేందుకు రాలేకపోయాడని పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.