Pawan Kalyan- Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో ఆణిముత్యాలు లాంటి సినిమాలు మిస్ అయ్యాడనే సంగతి మన అందరికీ తెలిసిందే..అయ్యో మా హీరో ఇంత గొప్ప సినిమాలు వదులుకున్నాడా అని అభిమానులు ఇప్పటికీ తలచుకొని బాధపడుతూ ఉంటారు..ఆ సినిమాలన్నీ ఒప్పుకొని చేసి ఉంటే ఎంత బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది ఫ్యాన్స్..ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి , గోలీమార్, నువ్వే కావాలి , అతడు, విక్రమార్కుడు, యువ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఒక్క ఆర్టికల్ సరిపోదు..అన్ని సూపర్ హిట్ సినిమాలు వదులుకున్నాడు.

పవన్ కళ్యాణ్ వదిలేసిన ఈ సూపర్ హిట్ సినిమాలన్నీ ఆయా హీరోల కెరీర్స్ ని మలుపు తిప్పాయి..ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో అద్భుతమైన కాంబినేషన్ మిస్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త..రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ కి సెట్ చేసుకున్న లైనప్ లో ఒకటి సురేందర్ రెడ్డి తో సినిమా.
ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో ఉన్న ఆసక్తి మామూలుది కాదు..అన్ని కలిసి వస్తే ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని తిరగరాస్తుంది అనుకున్నారు..పవన్ కళ్యాణ్ అత్యంత ఆప్త మిత్రుడైన రామ్ తల్లూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తాడని కూడా అధికారికంగా తెలిపారు..కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని పవన్ కళ్యాణ్ వదిలేసినట్టు తెలుస్తుంది..ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా ఇప్పట్లో ఈ సినిమా చేయలేనని..నాకోసం ఎక్కువ రోజులు ఎదురు చూస్తే అనవసరంగా మీ సమయం వృథా అవుతుంది, ఈ చిత్రం అన్నయ్య చిరంజీవి గారికి కూడా బాగా సెట్ అవుతుంది, ఆయనతో చేసుకోండి అని అన్నాడట.

సురేందర్ రెడ్డి ఈమధ్యనే చిరంజీవి ని కలిసి ఈ స్టోరీ వినిపించాడట..ఆయన కథ బాగా నచ్చడం తో వెంటనే చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట..అలా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ నుండి చిరంజీవి కి షిఫ్ట్ అయ్యింది..అయ్యో మంచి కాంబినేషన్ మిస్ అయ్యిందే అంటూ అభిమానులు బాధ పడుతున్నారు.