Niharika Konidela: ‘మెగా వారసురాలిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నిహారిక కొణిదెల హీరోయిన్ గా స్టార్ రేంజ్ కి ఎదుగుతుందని అందరూ అనుకున్నారు..రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది కానీ, అవి ఫ్లాప్ అయ్యేలోపు నిహారిక కి కావాల్సినంత గుర్తింపు రాలేదు..ప్రముఖ హీరో నాగ శౌర్య తో ‘ఒకమనసు’ అనే సినిమా చేసి బాగా ట్రోల్ల్స్ కి గురైంది..ఎందుకంటే ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు చాలా ఉంటాయి.

రొమాన్స్ పాళ్ళు మితిమీరడం తో మెగా ఫ్యాన్స్ నిహారిక కొణిదెల పై విరుచుకుపడ్డారు..ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది..అవి కూడా ఫ్లాప్స్ అయ్యేలోపు ఆమె నటనకి గుడ్ బై చెప్పేసి వెబ్ సిరీస్ లు మరియు సినిమాలకు నిర్మాతగా మారింది..తండ్రి నాగబాబు లాగానే నిర్మాణ రంగం లో నిహారిక కూడా సక్సెస్ అయ్యింది..అయితే నిహారిక గత కొంత కాలం నుండి సోషల్ మీడియా కి దూరం గా ఉంటూ వచ్చింది.
అందుకు కారణం కూడా లేకపోలేదు..ఒక రోజు పబ్ లో నిహారిక ఎంజాయ్ చేస్తుండగా ,ఆ పబ్ లోకి పోలీసులు వచ్చి రైడింగ్ చేసారు..ఆ రైడింగ్ లో పబ్ ఓనర్ దగ్గర డ్రగ్స్ కనిపించాయి..దాంతో పక్క రోజు పబ్ లో ఉన్న ప్రతీ ఒక్కరినీ పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారించారు పోలీసులు.

అలా నిహారిక కొణిదెల ని కూడా స్టేషన్ కి పిలిపించి విచారించారు..అది అప్పట్లో పెద్ద రచ్చ అయ్యింది..సోషల్ మీడియా లో నిహారిక పై విపరీతమైన నెగటివిటీ ఏర్పడింది..ఆ సమయం లో నెగటివిటీ ని తట్టుకోలేక కొన్ని రోజులు సోషల్ మీడియా కి దూరం గా ఉండాలని నిశ్చయించుకుంది నిహారిక..మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆమె ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టింది..తన లేటెస్ట్ ఫోటోలు మరియు రీల్స్ తో దుమ్ములేపేస్తుంది నిహారిక కొణిదెల.