
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. గత మూడు రోజుల నుండి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో ప్రారంభం అయ్యింది. పది రోజుల పాటు సాగనున్న ఈ చిన్న షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన లుక్స్ అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఈ లుక్స్ ని చూసి అభిమానులు మెంటలెక్కిపోతున్నారు.

సన్నని గెడ్డం తో బొట్టు ధరించి, చొక్కా మరియు లుంగీ కాస్ట్యూమ్స్ వేసి భీమ్లా నాయక్ స్టైల్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ లుక్స్ ని ప్రెజెంట్ చేసాడు. చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ కి మించిన సినిమా తియ్యబోతున్నాడని అర్థం అవుతుంది. ఇన్ని రోజులు ఈ చిత్రం తమిళం లో సూపర్ హిట్ అయినా తేరి మూవీ రీమేక్ అంటూ ప్రచారం చేసారు.

కానీ పవన్ కళ్యాణ్ లుక్స్, మరియు లొకేషన్ సెట్స్ ని చూస్తూ ఉంటే అదంతా కేవలం రూమర్స్ మాత్రమే అని అర్థం అవుతుంది.కేవలం తేరి థీమ్ ని తీసుకొని మొత్తం మార్చేసి తనదైన స్టైల్ లో హరీష్ శంకర్ ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడనే టాక్ కూడా ఉంది. ఏదైనా నిజమో, లేదా ఈ సినిమా అసలు రీమేక్ అనేదే కాదా అనేది టీజర్ వచ్చినప్పుడు అర్థం అవుతుంది. ఈ చిత్రం లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.మరో హీరోయిన్ గా పూజా హెగ్డే ని అనుకుంటున్నారు. ఈ ఏడాది చివరిలోపు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ షూటింగ్ లొకేషన్స్ లో ఒక ముఖ్యమైన వ్యక్తితో ఫోటో తీసుకుంటూ కనిపించాడు. నుదుట కుంకుమ బొట్టు, సన్నని గడ్డం, గళ్ళ చొక్కా, గళ్ళ లుంగీ మరియు చెవి పోగు వేసుకొని పవన్ కళ్యాణ్ ఊర మాస్ గా కనిపించాడు. దానికి సంబంధించిన ఫోటో ని మీరు క్రింద చూడొచ్చు.