
Prabhas Project K: ప్రాజెక్ట్ కే మూవీ మీద హైప్ పెంచేందుకు డిఫరెంట్ ప్రమోషనల్ టెక్నిక్స్ మేకర్స్ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా షూటింగ్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ డీటెయిల్స్ షేర్ చేస్తూ ఆసక్తి రేపుతున్నారు. ప్రాజెక్ట్ కే మూవీ మేకింగ్ కి స్క్రాప్ అనే ఓ ప్రోగ్రాం వాడుతున్నారు. ఈ సాంకేతికత ద్వారా మూవీలో ఉపయోగించే వస్తువులు, వాహనాలు, క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నారు. ఆ మధ్య ఒక టైర్ రూపొందించడం చూపించారు. టైర్ కోసం నెలల తరబడి కసరత్తు చేశాడు. అసలు టైర్ కోసం ఇంత హైరానా ఏమిటీ? సినిమాలో దాని ప్రాధాన్యత ఏంటనే? క్యూరియాసిటీ కలిగించారు.
తాజాగా రైడర్స్ పేరుతో విలన్ ఆర్మీని పరిచయం చేశారు. ప్రాజెక్ట్ కే మూవీలో మెయిన్ విలన్ కి ఓ ఆర్మీ ఉంటుంది. వాళ్ళందరూ తెల్లని సూట్స్ ధరించి ప్రత్యేకంగా ఉంటారు. హీరో మీదకు గుంపులు గుంపులుగా దాడి చేస్తారు. ఈ డెవిల్ ఆర్మీని దర్శకుడు నాగ్ అశ్విన్ టీం ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేశారు. ప్రాజెక్ట్ కే టీం అధికారికంగా విడుదల చేసిన ఈ వీడియో ఆకట్టుకుంది.
ఇక ప్రాజెక్ట్ కే కథపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ అని అర్థం అవుతుండగా… కథ విషయంలో పలు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇది శ్రీకృష్ణ భగవానుడుకి సంబంధించిన కథ. శ్రీకృష్ణుడి మోడరన్ అవతార్ అంటున్నారు. ప్రాజెక్ట్ కే టైటిల్ లో కే అంటే కృష్ణ అంటున్నారు. ఆ మధ్య నిర్మాత అశ్వినీ దత్ సుచాయిగా హింట్ ఇచ్చారు. ఈ క్రమంలో మూవీ మీద మరింత హైప్ ఏర్పడింది.

ప్రాజెక్ట్ కే మూవీ రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనె ప్రభాస్ కి జంటగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్నారు. దిశా పటాని మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రాజెక్ట్ కే 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అంటూ నాగ్ అశ్విన్ అన్నారు. ఈ మూవీ మీద తనకున్న ఆత్మవిశ్వాసం ఆయన కామెంట్స్ లో కనిపిస్తుంది.