
Upendra- Pawan Kalyan: ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో టాలీవుడ్ తర్వాత మంచి ఫామ్ లో ఉన్న ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే అది కన్నడ సినిమా ఇండస్ట్రీ అని చెప్పొచ్చు.రీసెంట్ టైం లో కన్నడ నుండి విడుదలైన KGF సిరీస్ మరియు కాంతారా వంటి చిత్రాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఏ రేంజ్ లో షేక్ చేశాయో అందరికీ తెలిసిందే.తెలుగు తో పాటుగా హిందీ మరియు తమిళం లో కూడా జెండా పాతేసింది కన్నడ సినిమా ఇండస్ట్రీ.ఇప్పుడు అదే ఇండస్ట్రీ నుండి విడుదల అవ్వబోతున్న మరో ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘కబ్జా’.
కన్నడ సూపర్ స్టార్స్ ఉపేంద్ర మరియు కిచ్చ సుదీప్ కలిసి చేసిన ఈ చిత్రం పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ నెల 17 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా మరో సారూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందని బలంగా నమ్ముతున్నారు విశ్లేషకులు.

ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే బెంగళూరు ప్రాంతం లో అట్టహాసం గా జరిగింది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా పిలిచారట.పవన్ కళ్యాణ్ రావాలని అనుకున్నాడు కానీ, షూటింగ్ ఆలస్యం అవ్వడం తో చివరి నిమిషం లో రాలేకపోయాడట.అందుకు గాను ఆయన ఒక లేఖని విడుదల చేసాడు, అందులో ఆయన ‘కబ్జా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనాల్సిందిగా నాకు ఉపేంద్ర గారి దగ్గర నుండి ఆహ్వానం అందింది, చివరి నిమిషం వరకు వచ్చే ప్రయత్నం చేశాను కానీ, నా షూటింగ్ సమయం పొడిగించినందుకు రాలేకపొయ్యాను.ఇందుకు నేను ఎంతో చింతిస్తున్నాను.దయచేసి నన్ను క్షమించండి..ఉపేంద్ర మరియు సుదీప్ నాకు ఎంతో కావాల్సిన మిత్రులు.వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ఈ ‘కబ్జా’ చిత్రం ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఒక లేఖని విడుదల చేసాడు.