
Ram Gopal Varma Rare Photos: సినీ ఇండస్ట్రీలో ఆయనో సంచలనం… సినిమాలు తీస్తే ప్రభంజనం..! ట్వీట్లు చేస్తే వివాదం.. మాట్లాడితే ప్రమాదం..! ఆయనే క్రేజీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఒకప్పుడు వరుస సినిమా హిట్లతో దూసుకుపోయిన ఆర్జీవి.. ఇప్పుడు వరుస ట్విట్లతో ప్రభుత్వాలను సైతం షేక్ చేస్తున్నాడు. రాంగోపాల్ వర్మను కొందరు ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్లుగా మారిపోయారు. ఆయన సినిమాల్లో నటించిన వారు స్టార్ హీరోలయ్యారు. కానీ ప్రస్తుతం ఆయనో వివాదాల దర్శకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. సమాజంలో జరిగే ప్రతీ సంఘటనపై రాంగోపాల్ వర్మ స్పందిస్తుంటారు. ఆయన శైలిలో ట్విట్టర్ ఖాతాలో రాసుకొస్తూ ఉంటారు. మొత్తానికి ఆ విషయాన్ని రచ్చ రచ్చ చేస్తారు. ఈ క్రమంలో ఆర్టీజీవిని ఎంతమంది వ్యతిరేకిస్తారో.. అంతేమంది ఆరాదిస్తూ ఉంటారు.

తాజాగా రాంగోపాల్ వర్మ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అయితే ఈసారి ఆయన ట్విట్లు చేయలేదు. తన ఫొటోలనే షేర్ చేశారు. తాను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న డిఫరెంట్ పిక్స్ ను నెట్టింట్లో షేర్ చేశారు. మూడు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆర్జీవి ఖాతాలో ఎన్నోబ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. ఎంతో మంది స్టార్ హీరోలు ఆయన డైరెక్షన్లో పనిచేసిన వారు ఉన్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ లోనూ ఆర్జీవి స్పెషల్. అందుకే ఆయన ఏం చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇప్పటి వరకు ఆర్జీవీపై వందల కేసులు నమోదయ్యాయి. కానీ కొన్ని కేసుల్లో ఆయనదే రైట్ అన్నట్లు తీర్పులు వచ్చాయి.

ప్రతీ విషయాన్ని సుత్తి లేకుంటా సూటిగా చెప్పే ఆర్జీవి 1962 ఏప్రిల్ 7న జన్మించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కృష్ణంరాజు, సూర్యమ్మ ఆయన తల్లిదండ్రులు. విజయవాడలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆర్జీవికి సినిమాలంటే చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్. తనకున్న ఇష్టాన్ని స్నేహితులతో పంచుకునేవారు. మరోవైపు సినిమాల్లో అవకాశాల కోసం వెతుకుతుండగా ‘రావుగారి ఇల్లు’ అనే తెలుగు సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ తరువాత అక్కినేని నాగార్జున తో కలిసి ‘శివ’ సినిమా చేశారు. ఈ సినిమాతో ఆర్జీవీ రేంజ్ ఇండియన్ వైడ్ గా వెళ్లింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా పలు సక్సెస్ చిత్రాలు నిర్మించారు.

హర్రర్ చిత్రాలు తీసే ఆర్జీవి సమాజంలో జరిగే యధార్థ సంఘటనలను సైతం తన రీల్ ద్వారా ప్రేక్షకులకు చూపిస్తారు. అయితే వీటిలో కొన్ని వివాదాలు ఏర్పడి కోర్టు కేసుల వరకు వెళ్లాయి. అయినా ఆర్జీవి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇలాంటి సినిమాలు తీసి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవల సినిమాలు తీయడం తక్కువైనా ట్విట్టర్ ఖాతాల్లో ఎక్కువగా సందడి చేస్తుంటారు. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ట్విటర్లో షేర్ చేస్తూ ప్రత్యేకంగా నిలుస్తారు.

ఈ తరుణంలో ఆర్జీవీకి చెందిన కొన్ని పిక్స్ సంచలనంగా మారాయి. ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరితో కలిసున్నారో.. అందుకు సంబంధించిన పిక్స్ ను బయటపెట్టారు. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి. ఈ ఫొటోలపై చాలా మంది రకరకాల కామెంట్లు పెడుతున్నారు.



