
Pawan Kalyan : కేవలం ఒకే ఒక్క సినిమాలో హీరోయిన్ గా నటించి, ఆ తర్వాత ఇండస్ట్రీ నుండి మాయం అయిపోయిన హీరోయిన్ సుప్రియ.ప్రముఖ హీరో సమంత్ చెల్లెలు , అక్కినేని నాగేశ్వర రావు గారి మానవరాలిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె, పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.
ఈ సినిమా ఇద్దరికీ మొదటి సినిమానే, అయితే సుప్రియ కి అసలు సినిమాల్లో నటించడం ఇష్టం ఉండేది కాదు, ఇంట్లో వాళ్ళు బలవంతం చెయ్యడం వల్లే ఆమె సినిమాల్లోకి వచ్చిందట.ఆమెకి కెమెరా ని ఫేస్ చెయ్యాలంటే చాలా భయం ఉండేదట.షూటింగ్ లొకేషన్స్ నుండి నాలుగైదు సార్లు పారిపోయిందట, ఇదంతా రీసెంట్ గా ఆమె పాల్గొన్న ‘నిజం విత్ స్మిత’ టాక్ షో లో చెప్పుకొచ్చింది.సుప్రియ తో పాటుగా సీనియర్ హీరోయిన్ రాధికా మరియు స్వప్న దత్ పాల్గొన్నారు.
ఇలా మాటికొస్తే షూటింగ్ ని తప్పించుకొని వెళ్తున్న తనని ఒక రోజు పవన్ కళ్యాణ్ దగ్గరకి పిలిచి ‘ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎన్ని కష్టాలొచ్చినా అది పూర్తి చెయ్యడమే మన కర్తవ్యం, నువ్వు ఈ సినిమా చేస్తానని నిర్మాతకి కమిట్మెంట్ ఇచ్చావు,కాబట్టి కచ్చితంగా నువ్వు పూర్తి చెయ్యాల్సిందే, మరోసారి ఇలా పారిపోవాలని చూస్తే బాగుండదు’ అంటూ పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట.ఇక ఆరోజు నుండి ఆమె మిస్ కాకుండా షూటింగ్ కి పాల్గొంటూ ఆ సినిమాని పూర్తి చేసిందట.
ఇదంతా స్వయంగా ఆమె నోటి నుండి వచ్చిన మాటలే.ఇక ఆ తర్వాత ‘ఇష్టం’ హీరో చరణ్ ని ప్రేమించి పెళ్లాడిన సుప్రియ కొంతకాలానికే విడిపోయింది.ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ ని మ్యానేజ్ చేస్తున్న ఈమె, కుర్ర హీరో అడవి శేష్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.