
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాల మీద సినిమాలను ప్రకటిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం ఆయన చేతిలో వినోదయ్యా చిత్తం రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్,హరి హర వీరమల్లు మరియు #OG చిత్రాలు ఉన్నాయి.వీటిల్లో వినోదయ్యా చిత్తం రీమేక్ మరియు హరి హర వీరమల్లు సినిమాల షూటింగ్స్ దాదాపుగా పూర్తి అయ్యాయి.’ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గానే ప్రారంభించుకొని ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.
ఇక నేటి నుండి ముంబై లో #OG మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.ఈ సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ మేకింగ్ వీడియో ని కూడా విడుదల చేసింది మూవీ టీం.ఇక్కడితో ఆయన సినిమాలన్నీ పూర్తి చేసి 2024 ఎన్నికల కోసం ‘వారాహి బస్సు యాత్ర’ ప్రారంభిస్తాడని అందరూ అనుకున్నారు.కానీ ఈలోపే మరో ప్రాజెక్ట్ చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే రవితేజ తో ‘రావణాసుర’ అనే చిత్రాన్ని తీసిన డైరెక్టర్ సుధీర్ వర్మ త్వరలోనే పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా తియ్యబోతున్నాడట.ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడని, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది అని, ఈ ఏడాదిలో సెప్టెంబర్ నెలలో పూజ కార్యక్రమాలు జరుగుతాయని ఫిలిం నగర్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన చిన్న మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా ఉంటాడట.#OG షూటింగ్ ప్రారంభం అయ్యింది అనే ఆనందం లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇప్పుడు ఈ వార్త మింగుడు పడనివ్వడం లేదు.
ఎందుకంటే సుధీర్ వర్మ కి కెరీర్ లో ‘స్వామి రారా’ అనే సూపర్ హిట్ తప్ప మరో హిట్ లేదు,అలాంటి డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ రేంజ్ హీరో అవకాశం ఇవ్వడం ఏమిటని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.కానీ ఎలాంటి సినిమాకి అయినా ఓపెనింగ్స్ రప్పించడం,రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టడం పవన్ కళ్యాణ్ స్టైల్ కాబట్టి ఈ సినిమాని కూడా అలాగే లాగేస్తాడని అంటున్నారు విశ్లేషకులు.ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరికొన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.