Ustad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ ని అలా మార్చేశారా?.. ఇదిగో క్లారిటీ!

Ustad Bhagat Singh: అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో పవన్ కళ్యాణ్ సెన్సేషన్స్ సృష్టిస్తున్నారు.మచిలీపట్నం వేదికగా మార్చి 14న జరిగిన జనసేన ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుండగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. హరి హర వీరమల్లు ఆల్రెడీ సెట్స్ పై ఉంది. వినోదయ సితం రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూట్స్ కి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన చిత్రాల్లో […]

Written By: Shiva, Updated On : March 15, 2023 4:18 pm
Follow us on


Ustad Bhagat Singh: అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో పవన్ కళ్యాణ్ సెన్సేషన్స్ సృష్టిస్తున్నారు.మచిలీపట్నం వేదికగా మార్చి 14న జరిగిన జనసేన ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుండగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. హరి హర వీరమల్లు ఆల్రెడీ సెట్స్ పై ఉంది. వినోదయ సితం రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూట్స్ కి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ మీద విపరీతమైన అంచనాలున్నాయి.

కారణం ఓ దశాబ్దం క్రితం పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. పవన్ ఇమేజ్ కి తగ్గట్లు దబంగ్ చిత్రానికి హరీష్ శంకర్ మార్పులు చేసి తెరకెక్కించారు. చెప్పాలంటే దబంగ్ చిత్రానికి గబ్బర్ సింగ్ కి ఎలాంటి పోలికలు ఉండవు. మూలకథ తీసుకొని పెద్ద ఎత్తున మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ మేనరిజం, వన్ లైనర్స్ అద్భుతంగా పేలాయి. పవన్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చిన మూవీగా గబ్బర్ సింగ్ నిలిచిపోయింది.

ఎట్టకేలకు పవన్ తో హరీష్ మూవీ సెట్ అయ్యింది. అందుకే ఫ్యాన్స్ కి ఉస్తాద్ భగత్ సింగ్ చాలా ప్రత్యేకమన్న మాట. ఉస్తాద్ భగత్ సింగ్ తేరి చిత్ర రీమేక్. ఈ మూవీలో హీరోకి కూతురు ఉంటుంది. అలాగే హీరో గతంలో పోలీస్ కాగా ఓ కారణంతో బేకరీ ఓనర్ గా మారతాడు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో ఈ రెండు విషయాలు మార్చేశారట. పాపకు బదులు బాబును పెడుతున్నారట. అనే పవన్ కి ఈ చిత్రంలో చిన్న కొడుకు ఉంటాడట. అలాగే బేకరీ ఓనర్ గా కాకుండా కాలేజ్ లెక్చరర్ గా పవన్ ని చూపించనున్నారట. బాబు పాత్ర చేసే చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ఆడిషన్స్ చేస్తున్నారట.

ఈ మేరకు ఓ మీడియా సంస్థ ట్వీట్ చేసింది. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా స్పందించారు. ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేశారు. సదరు మీడియా సంస్థ మీద ఒకింత అసహనం వ్యక్తం చేశారు. నన్ను అడిగితే చెబుతా కదా, నేరుగా ఇలా రాయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ మార్పులు చేశారన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.