
NTR – Ram Charan: మెగా మరియు నందమూరి అభిమానులు #RRR సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం తో పట్టరాని ఆనందంలో మునిగి తేలుతున్నారు.అయితే ఇలాంటి సందర్భం లో కూడా సోషల్ మీడియా లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ ఆగడం లేదు.ఎక్కడ చూసిన ఒకరిని ఒకరు పోల్చుకుంటూ తిట్టుకుంటూనే ఉన్నారు.దశాబ్దాల నుండి బాక్స్ ఆఫీస్ పోరు విషయం లో పోటాపోటీ ఉన్న ఈ రెండు కుటుంబాలు, కనీసం #RRR సినిమాతో అయినా ఒక్కటి అవుతారని అనుకున్నారు.
కానీ ఈ సినిమా ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన అభిమానుల మధ్య మరింత గొడవలు పెంచేలా చేసింది.ఇది ఇలా ఉండగా పాన్ వరల్డ్ రేంజ్ లో రామ్ చరణ్ మొదటి నుండి పాపులారిటీ విషయం లో జూనియర్ ఎన్టీఆర్ ని డామినేట్ చేస్తూ వచ్చాడు.ఇది నందమూరి అభిమానులకు చాలా ఇబ్బందిగా అనిపించింది.తమ హీరో కి ఒక్క హై మూమెంట్ వస్తే బాగుండును అని అనుకుంటూ ఉండేవారు.

అలా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ రోజు రోమాలు నిక్కపొడుచుకునే సందర్భం వచ్చింది.ఆస్కార్ వేదిక పై కీరవాణి మరియు చంద్రబోస్ అవార్డు తీసుకుంటున్న సమయం, వెనుక ఉన్న LED స్క్రీన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో వచ్చేలా చేసి, రామ్ చరణ్ ని పూర్తిగా పక్కకి నెట్టేశారు.
దీనిని ఎన్టీఆర్ అభిమానులు ఒక రేంజ్ లో ఎలివేట్ చేస్తూ సోషల్ మీడియా లో గత రెండు రోజుల నుండి నాన్ స్టాప్ గా పోస్టులు పెడుతూనే ఉన్నారు.మరో పక్క ఇంస్టాగ్రామ్ లో ఆస్కార్ అవార్డ్స్ అధికారిక హ్యాండిల్ జూనియర్ ఎన్టీఆర్ ని ఫాలో అవ్వడం మొదలు పెట్టింది.దీనిని కూడా నందమూరి ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.అయితే ఎన్టీఆర్ ని ఫాలో అయినా ఆస్కార్ అవార్డ్స్ వాళ్ళు, రామ్ చరణ్ ని ఎందుకు ఫాలో అవ్వలేదు?, రామ్ చరణ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఉన్నాడనే విషయం వాళ్లకి తెలియలేదా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్.