Pawan Kalyan HariHara Veeramallu : సింహంతో పవన్ కళ్యాణ్ ఫైట్: ‘హరి హర వీరమల్లు’ లో హైలైట్ సన్నివేశం ఇదేనట!

Pawan Kalyan HariHara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికి తెలిసిందే..ఇది వరుకు కేవలం ప్రాంతీయ భాషా చిత్రాలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ తొలిసారి భారీ బడ్జెట్ తో చారిత్రిక నేపథ్యం ఉన్న పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తుండడంతో ఈ మూవీపై అభిమానుల్లోనే కాదు..ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..ఇటీవలే ఈ సినిమాకి […]

Written By: NARESH, Updated On : November 2, 2022 11:18 pm
Follow us on

Pawan Kalyan HariHara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికి తెలిసిందే..ఇది వరుకు కేవలం ప్రాంతీయ భాషా చిత్రాలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ తొలిసారి భారీ బడ్జెట్ తో చారిత్రిక నేపథ్యం ఉన్న పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తుండడంతో ఈ మూవీపై అభిమానుల్లోనే కాదు..ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెష్ షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభించారు.

సుమారు 20 రోజుల పాటు విరామం లేకుండా తీయబోతున్న ఈ షెడ్యూల్ కోసం సుమారుగా 10 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు సమాచారం..ఈ 20 రోజులు సినిమాకి ఎంతో కీలకమైన ఇంటర్వెల్ ఫైట్ సీన్ ని తెరకెక్కిస్తారు అట..ఈ సీక్వెన్స్ లో పవన్ కళ్యాణ్ గెడ్డం తో కనిపించబోతున్నాడని టాక్..వర్క్ షాప్ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గెడ్డం లుక్ ఎంత ఉన్న ఫోటోలు ఎంతలా ట్రెండ్ అయ్యాయో మన అందరికి తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొత్తం 3 గెటప్పులు మరియు 30 డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో కనిపించనున్నారు..ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో వచ్చే ఒక్క ఫైట్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పటి వరుకు ఎవ్వరు చూడని విధంగా ఉండబోతుందట..సింహం తో పది నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ పోరాడే ఈ సన్నివేశం చూసే ప్రేక్షకులు మరియు అభిమానుల రోమాలు నిక్కపొడుచుకొని రేంజ్ లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది..ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు విడుదల చేసిన చిన్న గ్లిమ్స్ కి అభిమానుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మన అందరికి తెలిసిందే..డిసెంబర్ 31 వ తేదీన టీజర్ ని కూడా విడుదల చెయ్యబోతున్నట్టు సమాచారం.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా..బాలీవుడ్ బడా హీరో బాబీ డియోల్ ఓరంగజేబు పాత్రలో కనిపించబోతున్నాడు..పవన్ కళ్యాణ్ అభిమానులు చిరస్థాయిగా గుర్తించుకునే సినిమాలాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ ఎక్కడ తగ్గకుండా చూసుకుంటున్నాడట..జనవరి నెలాఖరు లోపు షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.