
Vakeel Saab Re Release: అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నాలుగేళ్ల పాటు సుదీర్ఘ విరామం తీసుకొని చేసిన చిత్రం ‘వకీల్ సాబ్’.దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి ని తీర్చింది.కరోనా సెకండ్ వేవ్ జనాలను వణికిస్తున్న సమయం లో విడుదలైన ఈ సినిమా , అంతటి పీక్ కరోనా ని తట్టుకొని కూడా 90 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను రాబట్టింది.కరోనా కేసులు రోజురోజుకీ పదింతలు ఎక్కువ అయిపోతూ వస్తుండడం తో థియేటర్స్ ని మొదటి వారం తర్వాత మూసి వెయ్యాల్సి వచ్చింది.
లేకపోతే ఈ చిత్రం 130 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను సాధించేది.కానీ థియేటర్స్ క్లోజ్ చేసినప్పటికీ ఈ సినిమా జనాల్లోకి రీచ్ అవ్వడం మాత్రం ఆగలేదు.ఓటీటీ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.టీవీ టెలికాస్ట్ లో అయితే 20 TRP రేటింగ్స్ ని దక్కించుకుంది.ఈ రేటింగ్స్ ని #RRR చిత్రం కూడా బ్రేక్ చెయ్యలేకపోయింది.
కానీ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్స్ లో చూడడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారు..కారణం ఈ చిత్రాన్ని వాళ్ళు కరోనా పీక్ సమయం లో థియేటర్స్ మూసివేయడం వల్ల రిపీట్స్ లో చూడలేకపోయారు కాబట్టి.రీ రిలీజ్ చేస్తే కనీవినీ ఎరుగని రేంజ్ నంబర్స్ ని పెడుతామని ఆ చిత్రం నిర్మాత దిల్ రాజు ని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఏప్రిల్ 9 వ తారీఖున ఈ సినిమా విడుదలైంది కాబట్టి దిల్ రాజు ఒకవేళ విడుదల చేస్తే ఆరోజే చెయ్యొచ్చని అనుకుంటున్నారు.ఈ సినిమాకి సంబంధించి అభిమానులు ఫస్ట్ లుక్ దగ్గర నుండి టీజర్ , ట్రైలర్ , థియేట్రికల్ రిలీజ్ మరియు టీవీ టెలికాస్ట్ ఇలా ప్రతీ ఒక్కటి ఒక పండుగ లాగ చేసారు.నేషనల్ మీడియా సైతం వకీల్ సాబ్ గురించి మాట్లాడుకునేలా చేసారు.ఇప్పుడు రీ రిలీజ్ లో కూడా అదే రేంజ్ హంగామా సృష్టిస్తుంది లేదా అనేది చూడాలి.