Viral News: ఆడపిల్ల పుడితేనే అరిష్టంగా భావించే నేటి రోజుల్లో ఆమెను అపురూపంగా చూసుకునే వారు కూడా ఉండటం తెలిసిందే. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. తమ ఇంటికి ఆడపిల్ల వచ్చిందని ఓ వ్యక్తి విమానంలో తీసుకువచ్చిన విషయం విధితమే. ఆడపిల్ల అని వివక్ష చూపకుండా మధ్యప్రదేశ్ లో ఇటీవల ఓ తండ్రి లక్ష పానీపూరీలు పంచి తన ప్రేమను చాటుకున్నాడు. కానీ కొందరు మాత్రం ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి మా ఇంటిలో పుట్టిందని సంబరపడిపోయే వారు కూడా ఉండటం గమనార్హం.

ఆడపిల్లను పురిట్లోనే తుంచేసే వారున్నారు. గర్భం అని తేలగానే పరీక్షలు చేసుకుని ఆడపిల్ల అయితే తొలగించుకునే వారు ఉండటం తెలిసిందే. దీంతో మరికొందరు మాత్రం మా ఇంటికి సాక్షాత్తు దేవత వచ్చిందని సంబరాలు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు నీచులు ఆడపిల్లను కుప్పల్లో వదిలేయడం చేస్తుంటారు. ఇలా ఆడపిల్ల పుట్టుకపై ఎన్నో విధాలా ఘటనలు వెలుగులోకి రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడపిల్ల పుట్టుకపై ఎన్ని విమర్శలు వచ్చినా వారికి కొన్ని చోట్ల దక్కే గౌరవం చూస్తుంటే వారిది కూడా మహర్జాతకమే అనిపిస్తోంది.
తమ గారాల కూతురుపై ఉన్న ప్రేమను తల్లిదండ్రులు ఇలా చూపించారు. ఓ కుర్చీలో కూర్చోబెట్టి ఆమె పాదాలను పాలతో కడిగారు. మరో పాత్రలో కుంకుమ నీళ్లు ఉంచి పాదాలను అందులో ముంచి ఓ తెల్ల టవల్ లో వేశారు. దీంతో ఆమె పాదాలకు అంతటి విలువ ఇస్తూ వీడియో తీయడంతో ఇది కాస్త వైరల్ అవుతోంది. దీన్ని ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ఎమోషనల్ మూమెంట్ట అంటూ ట్వీట్ లో ట్యాగ్ ను జత చేయడం ట్రెండ్ అవుతోంది. ఆడపిల్లకు ఇచ్చిన గౌరవానికి అందరు మంత్రముగ్దులవుతున్నారు.

ఆడపిల్ల పుట్టుకనే ప్రశ్నార్థకంగా మారుస్తున్న నేటి తరుణంలో ఆమెకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడం సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఆడపిల్ల పాదాలను పాలతో కడగడం అంటే ఆమెను సాక్షాత్తు దేవతగా భావించి చేసే పనికి అందరు ఫిదా అవుతున్నారు. ఇంతటి ఆదరాభిమానాలు చూపిస్తున్న తల్లిదండ్రులు ధన్యులను ప్రశంసిస్తున్నారు. దేవతామూర్తిగా భావించి ఆమెకు సేవ చేయడంపై నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆడపిల్లలను చులకనగా చూసే నేటిరోజుల్లో ఆమెకు అభిషేకం చేయడం చర్చనీయాంశం అవుతోంది.
Also Read:Liger: ‘లైగర్’ విజయ్ దేవరకొండ మన కరీంనగర్ కుర్రాడేనంట