
ప్రపంచ దేశాల ప్రజలకు కరోనా వైరస్ ఎన్నో చేదు అనుభవాలను మిగులుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి సోకుతుందో తెలియని ఈ వైరస్ కుటుంబాలకు కుటుంబాలనే చిన్నాభిన్నం చేస్తోంది. అయితే వైరస్ వల్ల పరిస్థితి విషమించిన కొందరు వైరస్ ను జయిస్తామని నమ్మకంతో వైరస్ తో పోరాడుతున్నారు. చాలామందిలానే అమెరికాలోని టెక్సాస్ కు చెందిన కార్లోస్ మునిజ్ అనే వ్యక్తి కూడా పోరాడుతున్నాడు.
ఆ వ్యక్తి ఆస్పత్రిలోనే ఆస్పత్రి యాజమాన్యం, సిబ్బంది మధ్య అతను ప్రేమించిన యువతిని వివాహం చేసుకున్నాడు. యువతిలో నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని ఆ వ్యక్తి అభయమిచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే కార్లెస్ అనే యువతికి గ్రేస్ అనే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లికి కొన్ని రోజుల క్రితం కార్లోస్ కరోనా వైరస్ నిర్ధారణ అయింది. మెథడిస్ట్ ఆస్పత్రిలో చేరిన కార్లోస్ కు ఆరోగ్యం అంతకంతకూ క్షీణించింది.
పరిస్థితి విషమించడంతో అతడిని ఐసీయూలో చేర్పించారు. నెల రోజుల తర్వాత అతడికి కరోనా నెగిటివ్ నిర్ధారణ అయినప్పటికీ పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది. అయితే అతని భార్య గ్రేస్ పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టటంతో ఐసీయూలోని బెడ్ నే పెళ్లివేడుకగా మార్చి వివాహం జరిపించారు. స్థానిక వారా సంస్థ కెన్స్ 5 వీళ్ల వివాహ వేడుకను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.