https://oktelugu.com/

పక్కన మగాడు కనిపిస్తే చాలు కథలు అల్లేస్తున్నారు: సీనియర్ నటి

సురేఖ వాణి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌. అక్కగా, వదినగా, భార్యగా.. ఇలా ఏ పాత్ర చేసినా అద్భుతంగా నటిస్తుందామె. రెడీ, బాద్‌షా, ద్వారకా, శమంతకమణి, పిల్ల నువ్వులేని జీవితం, రారండోయ్‌ వేడుక చూద్దాం ఇలా తెలుగులో చాలా చిత్రాల్లో నటించిన ఆమె ఈ మధ్య వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. భర్త చనిపోయిన తర్వాత సినిమాలకు కాస్త దూరమైందామె. అదే సమయంలో వయసు పెరగడంతో హీరోల తల్లి పాత్రలో నటించాలని ఆఫర్లు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 18, 2020 / 05:26 PM IST
    Follow us on


    సురేఖ వాణి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌. అక్కగా, వదినగా, భార్యగా.. ఇలా ఏ పాత్ర చేసినా అద్భుతంగా నటిస్తుందామె. రెడీ, బాద్‌షా, ద్వారకా, శమంతకమణి, పిల్ల నువ్వులేని జీవితం, రారండోయ్‌ వేడుక చూద్దాం ఇలా తెలుగులో చాలా చిత్రాల్లో నటించిన ఆమె ఈ మధ్య వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. భర్త చనిపోయిన తర్వాత సినిమాలకు కాస్త దూరమైందామె. అదే సమయంలో వయసు పెరగడంతో హీరోల తల్లి పాత్రలో నటించాలని ఆఫర్లు వస్తున్నా ఆమె అంగీకరించడం లేదు. దాంతో, ఆమె వెండితెరకు దూరమైంది. కానీ, ఈ సీనియర్ నటి తరచూ వార్తల్లో నానుతోంది.

    Also Read: గొప్పతనంలో మెగాస్టార్.. మె..గా..స్టా..రే ?

    ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అందుకు కారణం కూడా ఆమెనే అనొచ్చు. సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో హుందాగా కనిపించే వాణి సోషల్ మీడియాలో మాత్రం చిట్టిపొట్టి బట్టలు వేసుకొని ప్రేక్షకుల ముందుకొస్తుంది. తన కూతురు సుప్రియతో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ట్రావెల్‌ వీడియోలు, డ్యాన్స్‌ వీడియోలోనూ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కూతురును హీరోయిన్‌ చేసేందుకు ఆమెను తెరపైకి తెస్తోందని అంతా అనుకుంటున్నారు. అదే సమయంలో తల్లి పాత్రలు చేసేందుకు తన వయసేం అయిపోలేదని చెప్పే ప్రయత్నం చేస్తోందట. తన కూతురుకు పోటీగా అన్నట్టు పొట్టి దుస్తులు ధరించి గ్లామర్ ఒలకబోస్తోంది. దాంతో, సోషల్‌ మీడియాలో ఆమెకు ఫాలోవర్లు బాగానే పెరిగారు. అదే ఇప్పుడామెకు చిక్కులు తెచ్చిపెడుతోంది.

    Also Read: టాలెంటెడ్ డైరెక్టర్ కి తీవ్ర అవమానం !

    సోషల్‌మీడియాలో హాట్‌ హాట్‌ ఫొటోలు చూసి పలువురు ఆమెపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడివి సురేఖకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. తన పక్కన ఎవరు ఉన్నా తప్పుగా ప్రచారం జరుగుతోందని ఆమె వాపోతోంది. తన గురించి సోషల్‌ మీడియా, ఇతర మాధ్యమల్లో వస్తున్న పుకార్ల గురించి సురేఖ స్పందించింది. తన పక్కన కనిపించిన ప్రతి ఒక్క వ్యక్తితో తనకు లింక్ పెడుతున్నారని బాధ పడుతోంది. ముఖ్యంగా తన భర్త చనిపోయిన తర్వాత ఇది ఎక్కువైందని ఆమె వాపోతోంది. ‘నా పక్కన ఒక పురుషుడు కనిపిస్తే చాలు కథలు అల్లేస్తున్నారు. నాతో ఉన్నది నా కజినా, సోదరుడా? తండ్రా? అని కనీసం క్రాస్‌ చెక్‌ కూడా చేసుకోవడం లేదు’ అని చెప్పింది. తన పక్కన కనిపించిన ప్రతి మగాడితో సంబంధం అంటగట్టారని అంటోంది. అయితే , ఇలాంటి పుకార్లను తాను పట్టించుకోవడం మానేశానని స్పష్టం చేసింది.