Pakistani Vada Pav Girl: దాయాదులకు భారతీయ రుచులు.. లొట్టలేస్తూ లాగించేస్తున్నారు.. వీడియో వైరల్..

ముంబైలో వడపావ్‌ చాలా ఫేమస్‌. ఇప్పుడు కరాచీ వాసులు కూడా ఈ భారతీయ వంటకాన్ని తెగ ఇష్టపడుతున్నారు. ఈ విషయాన్ని కవిత స్వయంగా తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : May 13, 2024 10:55 am

Pakistani Vada Pav Girl

Follow us on

Pakistani Vada Pav Girl: చైనీస్‌ ఫాస్ట్‌ ఫుడ్‌.. ఇది చైనావాడి ఫుడ్‌ స్టాల్‌. 20 ఏళ్ల క్రితం ఈ వంటకాలను భారతీయులకు పరిచయం చేశారు చైనీయులు. ఈ రుచి నచ్చడంతో రెండు దశాబ్దాలుగా చైనీస్‌ ఫుడ్‌ను లాగించేస్తున్నారు భారతీయులు. ఇక మన భారతీయ వంటకాలు కాస్త స్పైసీగా ఉంటాయి. ఈ వంటకాలను కూడా విదేశీయులు ఇష్టపడతారు. అందుకే అమెరికా, యూకేతోపాటు అనేక దేశాల్లో ఇండియన్‌ ఫుడ్‌ స్టాల్స్‌ నిర్వహిస్తున్నారు మన భారతీయులు. మన దాయాది దేశం పాకిస్థాన్‌లో కూడా భారతీయ మహిళా ఫుడ్‌ స్టాల్‌ నిర్వహిస్తూ మన రుచులను దాయాదులకు చూపిస్తోంది. మన వంటకాలు నచ్చిన పాకిస్థానీలు లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు.

వీడియో వైరల్‌..
పాకిస్థాన్‌లో భారతీయులు బతకడమే కష్టం. భారత్‌ పేరు వింటేనే కయ్యానికి కాలుదువ్వుతారు. కానీ భారతీయురాలు నడుపుతున్న ఫుడ్‌ స్టాల్‌లో మన వంటకాలను లాగించేస్తున్నారు. ఈ స్టాల్‌లో శాకాహారం, మాంసాహారం రెండూ అందిస్తోంది. భారతీయురాలు నిర్వహిస్తున్న ఈ ఫుడ్‌ స్టాల్‌ వీడియోను ఓ పాకిస్థానీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఫుడ్‌ స్టాల్‌ గురించి వివరించాడు. ఈ వీడియోలో కవిత, ఆమె కుటుంబం అందిస్తున్న రుచికరమైన ఆహారం గురించి వివరించాడు.

కరాచీలో మన వడాపావ్‌
ముంబైలో వడపావ్‌ చాలా ఫేమస్‌. ఇప్పుడు కరాచీ వాసులు కూడా ఈ భారతీయ వంటకాన్ని తెగ ఇష్టపడుతున్నారు. ఈ విషయాన్ని కవిత స్వయంగా తెలిపారు. వీడియోను షేర్‌ చేసిన పాకిస్థానీ కూడా వడాపావ్‌ రుచి చూసి మెచ్చుకున్నాడు. ఇక కరాచీ భోజన ప్రియులు తనను కవితా దీదీ అని ఆప్యాయంగా పిలుస్తారని కవిత వీడియోలో పేర్కొన్నారు.

రంజాన్‌ మాసంలో బంద్‌..
ఇక ఏడాదంతా పాకిస్థానీలకు భారతీయ వంటకాలు చుచి చూపుతున్న కవిత ముస్లింల పవిత్ర మాసం రంజాన్‌ నెలలో మాత్రం మన వంటకాలను ఆపేస్తున్నారు. ఇందుకు కారణం కూడా వీడియోలో తెలిపారు కవిత. పవిత్రమైన రంజాన్‌ మాసంలో తాను ఫుడ్‌ స్టాల్‌ నడపనని తెలిపారు. ఇది విన్న పాకిస్థాని ఆశ్చర్యపోయాడు. ఇతర దేశాల్లోని మతాలను గౌరవించడం, అంకితభావం చూసి పాకిస్థానీ బ్లాగర్‌ ఆశ్చర్యపోయాడు. ఫిదా అయ్యాడు. ఇక సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మా సోదరికి పాకిస్థానీలందరూ మద్దతు ఇవ్వాలని రాశారు. కొందరు పాకిస్థాన్‌లో భారతీయ వంటకాలకు ఆదరణ లభించడం ఆనందంగా ఉందని కామెంట్‌ చేశాడు.