Honey Benefits: తేనెను ఇలా ఉపయోగించండి మీ పెదవులు సూపర్ సేఫ్

తేనెలో తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది శతాబ్దాలుగా చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి.

Written By: Swathi, Updated On : May 13, 2024 10:47 am

Honey Benefits

Follow us on

Honey Benefits: తేనెలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. దీని వల్ల అందం, ఆరోగ్యం రెండూ కూడా సొంతం చేసుకోవచ్చు. ఇందులో ఔషధ గుణాలు అంతా ఇంతా కాదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు తేనెతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.ప్రజలు తమ పెదాలను అందంగా, గులాబీ రంగులో మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇప్పటికీ వారు ఉపశమనం పొందలేరు. మీరు కూడా మీ పెదాల నలుపుతో ఇబ్బంది పడుతుంటే ఈ హోం రెమెడీని ప్రయత్నించడం ద్వారా మీరు మీ పెదాలను పింక్, అందంగా మార్చుకోవచ్చు.

తేనెలో తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది శతాబ్దాలుగా చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇది పగిలిన, నల్లని పెదాలకు తేమను అందిస్తుంది. అంతే కాదు తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది వాపు, చికాకును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది కాలిన పెదవులు, గాయాలను త్వరగా తగ్గిస్తుంది.

తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ నుండి పెదాలను రక్షించడంలో, నయం చేయడంలో సహాయపడుతుంది. అలాగే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడానికి కూడా పని చేస్తుంది తేనె. పెదవులు నల్లగా లేదా పగిలినా కూడా తేనెను ఉపయోగించి మీ పెదాలను స్క్రబ్ చేయవచ్చు. దీని కోసం మీరు తేనెలో కొంత చక్కెరను మిక్స్ చేయాలి. తర్వాత పెదాలపై మృదువుగా మసాజ్ చేయాలి.

పెదవులపై చికాకును తగ్గించడంలో తేనె చాలా సహాయపడుతుంది. అలాగే పెదలు పొడిగా ఉంటే దానిని తొలగించి పెదాలను హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇది పెదాలను ప్రకాశవంతంగా చేస్తుంది. పెదాలపై మాయిశ్చరైజర్‌ను నిర్వహించడానికి, చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి తేనె దివ్యౌషధంగా పరిగణించబడుతుంది.

తేనెను నేరుగా పెదాలపై అప్లై చేస్తే లిప్ బామ్‌లా పనిచేస్తుంది. నేరుగా ఉపయోగించకుండా వేడి నీటిలో ఒక చెంచా తేనె కలపాలి. ఇలా తయారు చేసుకున్న తేనెలో దూదిని నానబెట్టి, పెదవులపై కొన్ని నిమిషాల పాటు ఉంచండి. నిద్రపోయే ముందు, పెదవులపై పలుచని తేనెను రాసి, రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం కడిగేయండి. కానీ కొందరికి ఈ తెనె వల్ల ఇబ్బంది కూడా కలగవచ్చు. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.