India Top Trade Partners: రాజకీయం రాజకీయమే, వ్యాపారం వ్యాపారమే..

GTRI ప్రకారం, 2019 నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ టాప్-15 వాణిజ్య భాగస్వాముల మధ్య వాణిజ్యంలో గణనీయమైన మార్పు వచ్చింది.

Written By: Neelambaram, Updated On : May 13, 2024 11:18 am

India Top Trade Partners

Follow us on

India Top Trade Partners: ఆసియా ఖండంలో భారత్ కు సమ ఉజ్జీగా ఉన్న దేశం చైనా. ఆర్థికంగా భారత్ కంటే చైనా పై స్థానంలో ఉంటే, జనాభా పరంగా భారత్ కంటే కిందే ఉంది డ్రాగన్ కంట్రీ. భారత్ తో నిత్యం కయ్యానికి కాలు దువ్వడమే కాకుండా పాక్ ను సైతం భారత్ పైకి ఉసిగొల్పుతూ వేడుక చూస్తుంది. అయితే పొలిటికల్ జాగ్రఫీలో చూస్తే భారత్ లో మోడీ ప్రభుత్వం (బీజేపీ) వచ్చిన తర్వాత చైనా తన విధానాలను చాలా వరకు మార్చుకుంది. భారత్ కు ప్రపంచంలో పెరుగుతున్న ఆదరణ, ఆర్థికంగా బలపడడం లాంటివి గమనిస్తూ శత్రుత్వం కంటే మిత్రుత్వం మేలనుకుంటుంది. అయితే భారత్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటుంది. అమెరికా కంటే చైనాతోనే ఎక్కువ బిజినెస్ చేస్తుంది.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ ది. ప్రపంచంలోని అన్ని దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకుంటోంది. ఇప్పటి వరకు వ్యాపార భాగస్వామ్యాల పరంగా యునైటెడ్ కంట్రీస్ (US) భారత్ కు అతిపెద్ద భాగస్వామిగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో చిత్రం మారిపోయింది. వాస్తవానికి, గతేడాది, అమెరికా కాదు చైనా (డ్రాగన్) భారత్ కు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా నిలిచింది. ఎకనామిక్ థింక్ ట్యాంక్, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇంటియాటెవ్ (GTRI) ప్రకారం, రెండు దేశాల మధ్య 118.4 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఈ లెక్కలను పరిశీలిస్తే భారత్ తో వాణిజ్య పరంగా అమెరికా రెండో స్థానంలోకి వెళ్లిపోయిందని చెప్పవచ్చు.

చైనాకు 8 శాతంకు పైగా పెరిగిన భారత్ ఉత్పత్తులు..
GTRI రిలీజ్ చేసిన డేటా ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ మరియు చైనా మధ్య దిగుమతి-ఎగుమతి విలువ $118.4 బిలియన్లు. ఇందులో గత ఆర్థిక సంవత్సరంలో, చైనాకు భారత్ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 8.7 శాతం పెరిగి 16.67 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. చైనాకు ఎగుమతి చేసే వస్తువుల జాబితాను పరిశీలిస్తే, ఇనుప ధాతువు, పత్తి నూలు/ బట్టలు, చేనేత, సుగంధ ద్రవ్యాలు, పండ్లు మరియు కూరగాయలు, ప్లాస్టిక్‌, లినోలియం ఎక్కువగా ఉన్నాయి.

చైనా నుంచి భారత్ వీటిని దిగుమతి చేసుకుంది
ఒక నివేదిక ప్రకారం.. చైనా నుంచి భారత్ దిగుమతి కూడా పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, చైనా నుంచి భారత్ వస్తువుల దిగుమతి 3.24 శాతం పెరిగి 101.7 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. చైనా నుంచి భారత్ కు వచ్చే వస్తువుల్లో ప్రధానంగా ఎలక్ట్రానిక్, అణు రియాక్టర్స్, బాయిలర్స్, సేంద్రీయ రసాయనాలు, ప్లాస్టిక్ వస్తువులు, ఎరువులు, ఆటో మొబైల్ వస్తువులు, రసాయన ఉత్పత్తులు, ఇనుము మరియు ఉక్కు వస్తువులు, అల్యూమినియం ఉన్నాయి.

అమెరికాతో క్షీణత
ఎకనామిక్ థింక్ ట్యాంక్ GTRI డేటా ప్రకారం.. భారత్, చైనా మధ్య $118.4 బిలియన్ల వాణిజ్యం ఉండగా, FY 2023-24లో భారతదేశం మరియు అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $118.3 బిలియన్ల విలువైనది. ఈ సంఖ్యతో అమెరికా రెండో స్థానానికి పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమెరికా భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగింది. గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 1.32 శాతం తగ్గి 77.5 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 20 శాతం క్షీణించి 40.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

ఐదేళ్లలో మారిపోయిన వ్యాపారం
GTRI ప్రకారం, 2019 నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ టాప్-15 వాణిజ్య భాగస్వాముల మధ్య వాణిజ్యంలో గణనీయమైన మార్పు వచ్చింది. దీని ప్రభావం దిగుమతి మరియు ఎగుమతి గణాంకాలు రెండింటిపైనా కనిపించింది. ఇది మాత్రమే కాదు.. వాణిజ్య లోటు లేదా వాణిజ్య మిగులు పరిస్థితిలో కూడా మార్పులు కనిపించాయి. ఈ ఐదేళ్లలో, చైనాకు ఎగుమతుల్లో 0.6 శాతం స్వల్ప క్షీణత నమోదైంది. అయితే చైనా నుంచి దిగుమతులు పెరిగాయి. ఇది $16.75 బిలియన్ల నుంచి $16.66 బిలియన్లకు తగ్గింది.

అదే సమయంలో చైనా నుంచి దిగుమతులు 44.7 శాతం పెరిగి 70.32 బిలియన్‌ డాలర్ల నుంచి 101.75 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఈ దిగుమతుల పెరుగుదల కారణంగా వాణిజ్య లోటు పెరిగిందని, 2018-19లో 53.57 బిలియన్ డాలర్లుగా ఉన్నందున 2023-24 నాటికి 85.09 బిలియన్ డాలర్లకు పెరిగిందని GTRI వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.