https://oktelugu.com/

OYO: ఓయోలో రూమ్ బుక్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఖచ్చితంగా ఇవి తెలుసుకోండి ?

ఇప్పుడు ఓయో వంటి యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మీరు అడ్వాన్స్ చెల్లించి నేరుగా ఆన్‌లైన్‌లో గదిని బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ల ద్వారా మీరు హోటల్ రూమ్‌లను సులభంగా బుక్ చేసుకోవచ్చు.

Written By:
  • Rocky
  • , Updated On : November 5, 2024 / 09:30 AM IST

    OYO

    Follow us on

    OYO: ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు ప్రయాణం కంటే హోటల్ ఖర్చులకే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. హోటళ్లలో బస చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ప్రయాణం సరదాగా ఉంటుంది కానీ ప్రీమియం హోటల్‌లు బడ్జెట్‌లో లేవు. అయితే మీరు ఓయో రూమ్‌లను చౌకగా బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా, కొన్ని కొన్ని సార్లు మీరు బుకింగ్‌పై 75 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఏదైనా పని మీద వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే అక్కడి హోటల్‌లో ముందుగా రూమ్ బుక్ చేసుకుంటారు. ఇప్పుడు ఓయో వంటి యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మీరు అడ్వాన్స్ చెల్లించి నేరుగా ఆన్‌లైన్‌లో గదిని బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ల ద్వారా మీరు హోటల్ రూమ్‌లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. అయితే ఓయో హోటల్‌ని బుక్ చేసుకునే ముందు 10 సార్లు ఆలోచించాలి. లేకపోతే ప్రమాదంలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. లేదా చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో ఓయోలో రూమ్ బుక్ చేసిన ఓ వ్యక్తులను ఎదురైన వింత అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్న ఘటనలను ఎన్నో చూశాం. అందుకనే ఓయో రూం బుక్ చేసే ముందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కొందరు సూచిస్తున్నారు.

    ఇటీవల కాలంలో చాలా మంది ఓయో రూమ్‌లను బుక్ చేసుకుంటారు. ఓయో రూమ్‌లను బుక్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఓయో హోటల్స్‌లో ప్రజలు సురక్షితంగా ఉంటారని వారు చెబుతున్నప్పటికీ, ఓయో గదులను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఓయో గదులను భారతదేశంలో యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఓయో గదులకు తక్కువ అద్దె ఉంటుంది. అంతేకాదు చాలా మంది తాము సురక్షితంగా ఉన్నామని నమ్మి ఓయో గదుల్లోనే ఉంటున్నారు. దీనిని 2012లో రితేష్ అగర్వాల్ స్థాపించారు. ఓయో 80 దేశాలలో 800 కంటే ఎక్కువ నగరాల్లో పనిచేస్తుంది. 10 లక్షలకు పైగా గదులున్నాయి. అయితే, ఈ గదులు సురక్షితంగా ఉన్నాయని ఓయో చెబుతున్నప్పటికీ, తనిఖీ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఏదైనా హోటల్‌లో బస చేయడానికి ముందు, ఎల్లప్పుడూ అన్ని లైట్లు ఆఫ్ చేయండి. మొబైల్ ఫోన్ కెమెరాతో అన్ని ప్రదేశాలను కూడా తనిఖీ చేయండి. వాటిలో రహస్య కెమెరాలు పెట్టే అవకాశం ఉంది.

    కాబట్టి తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. లైట్లు ఆఫ్ చేసి సెర్చ్ చేస్తున్నప్పుడు రెడ్ లైట్ కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. అలాగే, లైట్లు, హీటర్లు, టీవీ వంటి ఎలక్ట్రికల్ ఉపకరణాలను జాగ్రత్తగా తనిఖీ చేయండి. గదిలో ఎక్కడైనా అద్దాలు ఉన్నాయో లేదో కూడా తనిఖీ చేయండి. అక్కడ ఎవరైనా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా ఆ అద్దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఓయోతో నమోదు చేయబడిన హోటళ్లలో ఎటువంటి వారెంట్లు లేకుండా పోలీసులు ప్రవేశించలేరని గుర్తుంచుకోండి. మీ వయస్సు 18 ఏళ్లు పైబడి ఉంటే, మిమ్మలను ఎవరూ అరెస్టు చేయలేరు.