https://oktelugu.com/

Garlic : వామ్మో చైనా వెల్లుల్లి.. తింటే బ్రెయిన్ డెడ్.. సర్వరోగాలు? మరి గుర్తించడం ఎలా?

నిత్యం వంటకాల్లో వినియోగించే వెల్లుల్లి విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. చైనీస్ వెల్లుల్లి భారత మార్కెట్లోకి గతంలోనే ఎంట్రీ ఇచ్చింది. తక్కువ ధరలోకే వచ్చిన చైనీస్ వెల్లుల్లిని భారత మార్కెట్లో నిషేధించింది ప్రభుత్వం. మరి ఈ వెల్లుల్లి వల్ల ఎంత డేంజర్? దీన్ని ఎలా గుర్తించాలి? భారతదేశంలో పండించిన వెల్లుల్లి, చైనీస్ వెల్లుల్లికి మధ్య తేడా ఏంటి? వంటి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 5, 2024 / 09:37 AM IST

    Whammo Chinese garlic.. brain dead if eaten.. all diseases? And how to identify?

    Follow us on

    Garlic : చైనీస్ వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదేనా ?: ఎక్కువ పురుగుల మందులు, రసాయనాలు ఉపయోగించి పండించే వెల్లుల్లి వలన ఎన్నో అనారోగ్య సమస్యలు రావచ్చు అంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు బాధ పెట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా వినియోగించినట్లయితే మూత్రపిండాల సమస్యలు వస్తాయట. క్లోరిన్ వినియోగం వలన ఎన్నో హానికారక సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అంతేకాదు శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.

    భారతదేశంలో పండించిన వెల్లుల్లి, చైనీస్ వెల్లుల్లికి మధ్య తేడాలు గుర్తిస్తే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. చైనీస్ వెల్లుల్లి చాలా చిన్నసైజులో ఉంటాయి. ఎక్కువ తెల్లగా లేదా లేత పింక్ రంగులో మార్కెట్ లో అందుబాటులో ఉంటున్నాయి. దేశీ వెల్లుల్లితో పోల్చి చూస్తే సైజులో చిన్నవిగా ఉంటున్నాయి కాబట్టి వీటిని సులభంగా గుర్తించవచ్చు. రుచిలో కూడా దేశీ వెల్లుల్లికి, చైనీస్ వెల్లుల్లికి చాలా తేడా ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఈ చైనీస్ వెల్లుల్లి ఘాటు తక్కువగా ఉండి పొట్టును తీయడం చాలా సులభం. దేశీ వెల్లుల్లి పొట్టును తీయడం అంత ఈజీ కాదు.

    వెల్లుల్లి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వెల్లుల్లి వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కానీ చైనీస్ వెల్లుల్లి వల్ల ఎన్నో శరీరానికి హానికరం అంటున్నారు నిపుణులు.

    ఇక ఈ దేశీయ వెల్లుల్లితో పోలిస్తే, చైనీస్ వెల్లుల్లి ధర 30 నుంచి 40 శాతం తక్కువ ఉంటుంది. కానీ చైనీస్ వెల్లుల్లి కంటే దేశీ వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవడం బెటర్. అయితే ఈ వెల్లుల్లి ఉత్పత్తి తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ధరలు పెరుగుతున్నాయి. వెల్లుల్లి పొడి, చిప్స్, పేస్ట్ వంటి ఉత్పత్తులను ఎగుమతి చేయడంలోనూ భారతదేశం అగ్రగామి. గుజరాత్‌లోని మహువ నుంచి ప్రతి సంవత్సరం 90,000 మెట్రిక్ టన్నుల వెల్లుల్లి ఎగుమతి అవుతుంటుంది. దీని విలువ సుమారు రూ. 400 కోట్లు అని సమాచారం. శీతాకాలం, పండుగల సీజన్‌లో వెల్లుల్లికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ధరలు పెరగడం కామన్. కానీ ఎన్నో ప్రయోజనాలు ఉన్న దేవీ వెల్లుల్లిని మాత్రమే కొనుగోలు చేసి వాటినే వినియోగించండి. చైనీస్ వెల్లుల్లి వల్ల అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి వీటిని స్కిప్ చేయడం ఉత్తమం.