https://oktelugu.com/

Anikha Surendran: సూపర్ హిట్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అనిక వయసు తెలుసా… అప్పుడే అంత పెద్దది అయిపోయిందా?

స్టార్ హీరో అజిత్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అనిక సురేంద్రన్ వయసు రెండు పదులకు చేరుకుందట. మొన్నటి వరకు చిన్న పాపగా ఉన్న అనిక హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : December 3, 2024 / 05:05 PM IST

    Anikha Surendran

    Follow us on

    Anikha Surendran: కేరళ కుట్టి అనిక సురేంద్రన్ ఆరేళ్ళ ప్రాయంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. 2010లో విడుదలైన మలయాళ చిత్రం కథ తుదరున్ను ఆమె డెబ్యూ మూవీ. అనంతరం మమ్ముట్టి, విజయ్ సేతుపతి, జయం రవి, అజిత్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. అనికకు విశ్వాసం మూవీ భారీ ఫేమ్ తెచ్చి పెట్టింది. అజిత్, నయనతార జంటగా నటించిన విశ్వాసం బ్లాక్ బస్టర్ హిట్. అజిత్ కూతురు పాత్రలో అనిక మెప్పించింది.

    దర్శకుడు శివ తెరకెక్కించిన విశ్వాసం మూవీలో అనిక నటన మెప్పిస్తుంది. ఈ మూవీలో తెలుగులో కూడా ఆదరణ దక్కించుకుంది. తరచుగా టెలివిజన్ లో ప్రసారం చేస్తుంటారు. కాగా నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఘోస్ట్ సైతం అనిక కీలకమైన ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది. ఘోస్ట్ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. నాగార్జునకు జంటగా సోనాల్ చౌహాన్ నటించింది. ది ఘోస్ట్ ఆశించిన స్థాయిలో ఆడలేదు.

    కాగా అనిక సురేంద్రన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. మొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అనిక హీరోయిన్ పాత్రలు చేసేంత పెద్దది ఎప్పుడు అయ్యిందని జనాలు వాపోతున్నారు. అయితే అనిక ప్రస్తుత వయసు 20 ఏళ్ళు అట. 2004 నవంబర్ 27న జన్మించిన అనిక ఇటీవలే రెండు పదుల వయసులో అడుగుపెట్టింది.

    ఇక అనిక హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం NEEK. ఈ చిత్రం కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి హీరో ధనుష్ దర్శకుడు కావడం మరొక విశేషం. అలాగే ఆయన ఈ చిత్రానికి రచయిత. నిర్మాత కూడాను. ఇటీవల తన 50వ చిత్రం రాయన్ కి ధనుష్ దర్శకుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అనిక, ప్రియా ప్రకాష్ వారియర్, మ్యాథ్యూ థామస్, సతీష్, పవిష్ నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 21న విడుదల కానుంది.

    అలాగే ఇడ్లీ కాదల్ టైటిల్ తో మరో చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ చిత్రంలో కూడా అనిక ఓ రోల్ చేయడం విశేషం. ఆమె ఫ్యాన్స్ హీరోయిన్ గా కూడా అనిక సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.