
Pooja Hegde: పూజా హెగ్డే కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజా ప్రమోషనల్ ఈవెంట్ లో పూజ హెగ్డే లుక్ టెంప్ట్ చేసేలా ఉంది. రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో అభిమానులను ఉడికించారు. ట్రెండీ వేర్ లో పూజా ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సోఫాలో పడుకొని దారుణమైన ఫోజులో స్కిన్ షోకి తెరలేపారు. పూజా హెగ్డే ఫోటోలు వైరల్ అవుతుండగా… ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ రంజాన్ కానుకగా ఏప్రిల్ 21న విడుదల కానుంది. సల్మాన్ హీరోగా దర్శకుడు ఫర్హాన్ సామ్జీ దర్శకత్వం వహించారు. తమిళ చిత్రం వీరం కి రీమేక్ గా తెరకెక్కింది. చిత్ర ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు పెరిగాయి. ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ లో కూడా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంపై ఆసక్తి ఉంది. వెంకటేష్ కీలక రోల్ చేస్తుండగా, రామ్ చరణ్ ఓ సాంగ్ లో కనిపించనున్నారు.

ఈ చిత్ర విజయం మీద పూజా హెగ్డే చాలా ఆశలే పెట్టుకున్నారు. కారణం ఈ మధ్య ఆమె టైం అసలేం బాగోలేదు. 2022లో పూజా నటించిన చిత్రాలన్నీ పరాజయం పొందాయి. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆమె కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. టాలీవుడ్ లో కూడా ఆఫర్స్ తగ్గిపోయాయి.

అర్జెంటుగా పూజా హెగ్డేకి ఒక హిట్టు కావాలి. దాని కోసం ఆమె తాపత్రయ పడుతున్నారు. ఇక సల్మాన్ ఏం చేస్తారో చూడాలి. కాగా టాలీవుడ్ లో పూజ నటిస్తున్న ఒకే ఒక చిత్రం ఎస్ఎస్ఎంబి 28. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో పూజా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా చేస్తున్నారు.

కలిసొచ్చిన దర్శకుడు కావడంతో సల్మాన్ మూవీ అటూఇటూ అయినా త్రివిక్రమ్ హిట్ ఇస్తాడని పూజా భావిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మహేష్ తో ఇది పూజాకు రెండో చిత్రం. త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ మూవీ. మరి చూడాలి పూజా కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో..