
Orange Re Release Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన సినిమాలలో భారీ డిజాస్టర్స్ లిస్ట్ తీస్తే అందులో ‘ఆరెంజ్’ సినిమా కచ్చితంగా ఉంటుంది. అప్పట్లో ‘మగధీర’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టిన తర్వాత వచ్చిన సినిమా కావడం, దానికి పాటలు ఆరోజుల్లో సెన్సేషన్ అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని అంటాయి. వాటిని అందుకోవడం ఎవరి తరం కాక ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది కానీ, కంటెంట్ పరంగా కల్ట్ క్లాసిక్ అని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇప్పటికీ బలంగా నమ్ముతారు.
ఒక్కసారి ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసి చూడండి, దాని రేంజ్ ఏంటో మీకే తెలుస్తాది అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ మొదటి నుండి సోషల్ మీడియా లో చెప్తూనే ఉన్నారు. ఆ చిత్ర నిర్మాత నాగబాబు అందుకే ఈ సినిమాని రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసాడు..రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చింది.
ఒక డిజాస్టర్ సినిమా రీ రిలీజ్ అయితే ఇంత రెస్పాన్స్ వస్తుందా..? అని ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మొదటి రోజు వచ్చిన వసూళ్లు చూసి ట్రేడ్ పండితులు సైతం షాక్ కి గురయ్యారు. వాళ్ళ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు చెప్తున్నారు.

ఓవర్సీస్ లో షోస్ లేకపోయినా కూడా ఈ రేంజ్ వసూళ్లు ఒక డిజాస్టర్ సినిమాకి అంటే మామూలు విషయం కాదు, రామ్ చరణ్ క్రేజ్ ప్రస్తుతం వేరే లెవెల్ లో ఉంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో షోస్ నడుస్తున్నాయి. నిన్న అంత ఓపెనింగ్ వచ్చిన తర్వాత కూడా నేడు ఈ సినిమాకి ప్రతీ చోట అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. నేడు కూడా ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్తున్నారు విశ్లేషకులు.