Upasana: మెగా అభిమానులకు ఈ ఏడాది పండుగ లాంటి ఏడాది అనే చెప్పాలి..#RRR చిత్రం ద్వారా పాన్ వరల్డ్ రేంజ్ లో రామ్ చరణ్ కి గుర్తింపు రావడమే కాకుండా..అంతర్జాతీయ అవార్డ్స్ కి నామినేట్ అవ్వడం తో పాటు, త్వరలోనే ఆయనకీ ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో కూడా చోటు దక్కబోతుంది అనే వార్తలు రావడం ఒకపక్క ఫ్యాన్స్ కి పట్టరాని అనందం ని కలిగించగా, మరోపక్క ఆయన అతి త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అనే శుభవార్త అభిమానుల అనందం ని పదింతలు రెట్టింపు చేస్తుంది.

మెగా కుటుంబం మొత్తం ఇప్పుడు పండుగ వాతావరణం లో ఉంది..గత కొద్ది రోజులుగా ఫారిన్ ట్రిప్ లో ఉన్న రామ్ చరణ్ – ఉపాసన నిన్ననే హైదరాబాద్ కి వచ్చారు..వచ్చి రాగానే ఉపాసన రామ్ చరణ్ తో పాటు ఇంటికి రాకుండా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అట..ఇక నుండి ఆమె డెలివరీ అయ్యే వరుకు పుట్టింట్లోనే ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
సాధారణంగా ఏ అమ్మాయి అయినా గర్భవతి అయ్యినప్పుడు పుట్టింట్లోనే ఉంటారు..డెలివరీ అయ్యే వరుకు అక్కడే ఉండి, ఆ తర్వాత తిరిగి భర్త వద్దకి వస్తారు..సాధారణ మధ్య తరగతి కుటుంబాలు చాలా వరుకు ఇది ఫాలో అవుతూ వచ్చాయి ..రామ్ చరణ్ – ఉపాసనలు కూడా అదే ఫాలో అవ్వడం విశేషం.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు..ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో తన 50 వ సినిమాగా నిర్మిస్తున్నాడు..ఇందులో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు..ఈమధ్య న్యూజిలాండ్ లో ఒక సాంగ్ ని షూట్ చేసారు..2023 వ సంవత్సరం లో విడుదల అవుతుంది అనుకున్న ఈ చిత్రం, ఇప్పుడు 2024 వరుకూ విడుదల అయ్యే సూచనలు కనిపించడం లేదు..ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు..ఆ రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ సోషల్ మీడియా లో లీకై ఇప్పటికే వైరల్ గా మారింది.