Inland Taipan Snake: ప్రపంచంలో అత్యంత ప్రమాకరమైన పాములు ఎన్నో ఉన్నాయి. అందులో ఆస్ట్రేలియాలో ఉండే ఇన్ ల్యాండ్ తైపాన్ అనే జాతికి చెందిన పాము ఎంతో ప్రాణాంతకమైనదిగా గుర్తించారు. దీని ఆకృతి కూడా భిన్నంగా ఉంటుంది. ఈ పాము ఉదయం సమయంలోనే యాక్టివ్ గా ఉంటుంది. దీని కోరలు 3.5 నుంచి 6.2 మి.మీటర్ల పొడవు ఉంటాయి. ఈ పాము ఒక్కసారి కాటు వేస్తే 100 మందిని చంపేయగలదు. ఇంతకన్న ప్రమాదకరమైన పాములు చాలానే ఉన్నా ఇవి మాత్రమే ఇప్పుడు ప్రమాదకరమైనవిగా తేల్చారు.

పాముల్లో నాగుపాము, కట్ల పాము, నల్లత్రాచు, రక్తపింజర వంటివి మనకు కనిపించేవి. కానీ వాటికంటే ప్రమాదకరమైన పాములు ఆస్ట్రేలియాలో మాత్రమే ఉండటం గమనార్హం. ఇలాంటి ప్రమాకరమైన పాముల గురించి శాస్త్రవేత్తలు అనేక విషయాలు బయటపెట్టారు. దీని వల్ల మనుషులకు ప్రమాదం ఉందని గుర్తించారు. తైపాన్ కు చెందిన ఈ పాముకు ఇంకో టాలెంట్ ఉంది. ఇది రంగులు మార్చుకుంటుంది. రుతువులను బట్టి తన శరీర రంగును ఊసరవెళ్లిలా మార్చుకుంటుంది. శీతాకాలంలో ముదురు గోధుమ రంగులో, వేసవి కాలంలో లేత గోధుమ వర్ణంలో ఇది మనుగడ సాగిస్తుంది. ఇది ఒక్క కాటుతో 110 మి. గ్రాముల విషాన్ని విడుదల చేస్తుంది.
దీంతో వంద మందికి పైగా మనుషుల ప్రాణాలు పోతాయి. 2.50 లక్షల ఎలుకలు కూడా చనిపోతాయని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ కు చెందిన పరిశోధకులు తెలియజేశారు. ఇది పగటి పూట కనిపించడం చాలా తక్కువ. దీని ప్రధాన ఆహారం ఎలుకలు, కోడిపిల్లలు మాత్రమే. ఉదయం పూట నేలపై ఉంటూ రాత్రి సమయంలో రాళ్ల మధ్య ఉంటుంది. ఇలాంటి పాములు ప్రపంచంలో 600 జాతులు ఉన్నా ఇదే అత్యంత ప్రమాకరమైనదని తేల్చారు. దీని వల్ల మనుషులకు ప్రమాదమే ఉంటుందని చెబుతున్నారు.

మనదేశంలో పాములను దేవతలుగా పూజిస్తాం. ప్రత్యేకంగా నాగుపాముని శివుని మెడలో ఉండే పాము కావడంతో దేవాలయాలు నిర్మించారు. పూజలు సైతం చేస్తుంటారు. పాములను విష సర్పాలుగా చూడకుండా మనకు ఏవైనా దోషాలుంటే కూడా నాగులకు పూజలు చేస్తే తగ్గిపోతాయని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. పాముల గురించి అనాది కాలం నుంచి దేవుళ్లుగా భావించి పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. నాగుల చవితికి నాగేంద్రుడికి పుట్టలో పాలు పోసి మహిళలు తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు.